అన్నయ్య ముఖ్య అతిధిగా ఆడియో!
on Jun 23, 2016

సినిమా ఇండస్ట్రీకి మెగాస్టార్ చిరంజీవిని ఆదర్శంగా తీసుకొని వచ్చినవారు కొందరైతే.. ఎంటరయ్యాక ఆయన సపోర్ట్ తో సూపర్ స్టార్ డమ్ సాధించినవారు ఇంకొందరు. వారిలో కమెడియన్ టర్నడ్ హీరో సునీల్ ఒకడు. సునీల్ అంటే చిరంజీవికి ప్రత్యేకమైన అభిమానం, అందుకే తాను నటించే ప్రతి సినిమాలో ఏదో ఒక పాత్రలో సునీల్ ను నటింపజేసేవాడు చిరు. ఇటీవల "మా అవార్డ్స్" వేడుకలోనూ చిరంజీవితో కలిసి చిందులేసి తన అభిమానాన్ని చాటుకొన్నాడు సునీల్. ఆ అభిమానానికి ప్రతిఫలంగా సునీల్ నటిస్తున్న తాజా చిత్రం "జక్కన్న" ఆడియో వేడుకకు హాజరవ్వడానికి ఒప్పుకొన్నాడు. "ప్రేమకథా చిత్రమ్" అనంతరం సుదర్శన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో సునీల్ సరసన మన్నార చోప్రా కథానాయికగా నటిస్తోంది. దినేష్ కంగరత్నం సంగీత సారధ్యం వహించిన ఈ చిత్రం ఆడియో విడుదల వేడుక రేపు (జూన్ 24) సాయంత్రం, శిల్పకళావేదికలో జరగనుంది!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



