తండ్రి బాటలో... శర్వా హీరోయిన్!
on Aug 13, 2019
శర్వానంద్ సరసన 'రణరంగం'లో ఓ కథానాయికగా కల్యాణీ ప్రియదర్శన్ నటించింది. ఇంతకు ముందు 'హలో'లో అక్కినేని అఖిల్ సరసన, 'చిత్రలహరి'లో సాయిధరమ్ తేజ్ సరసన నటించింది. మలయాళ, హిందీ సినిమాల దర్శకుడు ప్రియదర్శన్, ఒకప్పటి కథానాయిక లిజి కుమార్తె ఈమె. లిజి పలు తెలుగు సినిమాల్లో నటించారు. తెలుగులో 'గాండీవం', 'నిర్ణయం' సినిమాలకు ప్రియదర్శన్ దర్శకత్వం వహించారు. మొదట తల్లి బాటలోకి వచ్చారు కళ్యాణి. కథానాయిక అయ్యారు. ఏదో ఒక రోజు తండ్రి బాటలో నడుస్తానని చెప్పారు. "ఇప్పుడు అప్పుడు అనేది చెప్పలేను కానీ, ఏదో ఒక రోజు దర్శకురాల్ని అవుతా. మెగాఫోన్ పడతా. నా బుర్రలో కొన్ని ఐడియాలు ఉన్నాయి. వాటిని కథలుగా రాస్తాను. దర్శకత్వం వహిస్తాను" అని 'రణరంగం' విడుదల సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో కల్యాణీ ప్రియదర్శన్ చెప్పారు. సినిమా విషయానికి వస్తే... శర్వానంద్ పాత్ర చుట్టూ తిరుగుతుందని తెలిపారు. గ్యాంగ్ స్టర్ జీవితంలో ప్రేమను తన పాత్ర ద్వారా చూపించారని ఆమె అన్నారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
