ఇండస్ట్రీ రూల్స్... ప్రొటోకాల్స్ అంటే ఏంటి రెజీనా?
on Aug 13, 2019

తెలుగు చిత్ర పరిశ్రమలో కథానాయికగా రెజీనా వయసు ఏడేళ్లు. నటిగా ఆమె ప్రతిభపై ఎవరికీ సందేహాలు లేవు. కానీ, అదృష్టం కలసి రాక ఉన్నత స్థాయికి చేరుకోలేదనే మాట ఇటు ఇండస్ట్రీలో, అటు ప్రేక్షకుల్లో వినిపిస్తుంటుంది. పెద్ద హీరోల సరసన ఆమెకు అవకాశాలు రాలేదు. ఎందుకు రాలేదని రెజీనాను ప్రశ్నిస్తే తనకూ తెలియదన్నారు. అలాగే, ఇండస్ట్రీలో రూల్స్, ప్రోటోకాల్స్ ఉంటాయని, తను వాటిని ఫాలో కాకుండా సొంత రూల్స్ ఫాలో అవుతానని, సొంతంగా నిర్ణయాలు తీసుకుంటానని రెజీనా చెప్పారు. ఇండస్ట్రీ రూల్స్, ప్రోటోకాల్స్ అంటే ఏంటి? అనేది చెప్పలేదు. తెలివిగా మాట్లాడారు. అవి తెలుసుకోవడానికి సమయం పట్టిందని చెప్పారు. ఒకవేళ రెజీనా క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతున్నారా? ఏడేళ్లలో ఇండస్ట్రీలో చాలా విషయాలు తెలుసుకున్నాని అన్నారామె. ఒకట్రెండు ఫ్లాపులు వచ్చినంత మాత్రానా కెరీర్ ముగిసినట్టు కాదని, తనకు ఎంతో భవిష్యత్ ఉందని, తన కెరీర్ ను ఎవరు డిసైడ్ చేయలేరని రెజీనా వ్యాఖ్యానించారు. ఆగస్టు 15న విడుదల కానున్న 'ఎవరు'తో హిట్టు కొడతానని ధీమాగా ఉన్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



