కాజల్ ను తిడుతున్న నెటిజన్లు..!
on Jun 8, 2016

మన టైం బాగున్నప్పుడు తప్పు చేసినా ఒప్పై పోతుంది. అదే కాలం కలిసిరాకపోతే చేసే ప్రతీ పనీ తప్పులాగే మారుతుంది. ప్రస్తుతం చందమామ కాజల్ ఇదే పరిస్థితిని ఎదుర్కొంటోంది. సర్దార్ గబ్బర్ సింగ్, బ్రహ్మోత్సవం లాంటి భారీ ఫ్లాపులతో అల్లాడుతున్న కాజల్ అకౌంట్ లో ఇప్పుడు ఒక హిందీ సినిమా మాత్రమే ఉంది. ఈలోపు ఫేడవుట్ అవ్వకుండా అక్కడక్కడా కొన్ని యాడ్స్ లో మెరుస్తున్న ఈ భామకు ఒక యాడ్ మాత్రం బాగా నెగటివిటీని తీసుకొచ్చింది. లేటెస్ట్ గా ఆమె చేసిన ఒక మ్యాంగో ఫ్రూట్ జ్యూస్ యాడ్ ను చూసి నెటిజన్లు ఆమెను తిడుతూ అసభ్యకరమైన కామెంట్స్ పెడుతున్నారు. గతంలో బాలీవుడ్ భామ కత్రినాకైఫ్ ఇలాంటి ప్రకటనలో నటించి తీవ్రవిమర్శలు ఎదుర్కొంది. ఆ తర్వాతి నుంచి ఆ ప్రకటన తీరును మార్చింది అడ్వర్టైజింగ్ కంపెనీ. ఇప్పుడు కాజల్ వంతు వచ్చినట్టుంది. మరి ఈ విమర్శలకు కాజల్ నుంచి ఎలాంటి సమాధానం వస్తుందో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



