మూడున్నర గంటలు కూర్చుంటున్న కాజల్!
on Mar 4, 2023

కాజల్ పేరుకు అక్కడ మూడున్నర గంటలు కూర్చుంటున్నారేగానీ, ఆమె మనసంతా కొడుకు చుట్టూనే ఉంటోంది. ఇప్పుడేం చేస్తున్నాడు? తిన్నాడా? నిద్రపోతున్నాడా? ఆడుకుంటున్నాడా? అంటూ ఒకటే ఆరా తీస్తూ ఫోన్లు చేయాలనిపిస్తోందట. అయితే అలా చేయడానికి వీల్లేని పరిస్థితుల్లో ఉన్నారు కాజల్. మూడున్నర గంటల పాటు ఎటూ కదలకుండా దీక్షగా కూర్చుంటున్నారు.దానికి కారణం ఏంటో తెలుసా? ఇండియన్ 2. కమల్‌హాసన్ హీరోగా నటిస్తున్న సినిమా ఇండియన్2. భారతీయుడు సినిమా విడుదలై రెండున్నర దశాబ్దాలు దాటిన తర్వాత తెరకెక్కుతోంది ఇండియన్2. అప్పుడు ఈ సినిమాకు దర్శకత్వం వహించిన శంకర్ ఇప్పుడు కూడా దర్శకత్వం వహిస్తున్నారు. పూర్తిస్థాయి పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది ఈ సినిమా. ఇప్పుడు, ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
ఇందులో 90 ఏళ్ల కమల్‌హాసన్‌కి భార్యగా నటిస్తున్నారు కాజల్. పూర్తిగా వయోభారంతో కుంగిపోయిన మహిళగా నటిస్తున్నారు. ఆ లుక్ కోసం ఆమెకు ప్రాస్థటిక్ మేకప్ వేయడానికి కంప్లీట్‌గా మూడున్నర గంటల సమయం పడుతోందట. షూటింగ్ పూర్తయ్యాక మేకప్ తీయడానికి కూడా అంతే సమయం పడుతోందట. షూటింగ్ మధ్యలో కూర్చుని తినడానికి కూడా వీలుపడటం లేదట. అందుకే ద్రవాహారం మీదే ఉన్నానంటున్నారు కాజల్. రీసెంట్‌గా ఇండియన్2 కోసం గుర్రపుస్వారీని మళ్లీ నేర్చుకున్నారు మిసెస్ కాజల్. గౌతమ్ కిచ్లుని పెళ్లి చేసుకున్న తర్వాత కాజల్ ఇప్పటిదాకా తెలుగు సినిమాకు సంతకం చేయలేదు.
కొత్తపెళ్లికూతురుగా ఆమె ఆచార్య సెట్లోకి అడుగుపెట్టారు. ఆమెకు, గౌతమ్‌కు దండలు మార్పించి గ్రాండ్‌గా వెల్కమ్ చెప్పింది మెగా టీమ్. లాహే లాహే లిరికల్ వీడియోలోనూ కాజల్ స్టెప్పులేసిన షాట్స్ ఉన్నాయి. అయితే తీరా సినిమా విడుదలయ్యాక సినిమాలో కాజల్ లేరు. ఆమెకు ఈ విషయం ముందే తెలుసని చెప్పేశారు కొరటాల శివ. అయితే ఆచార్య నుంచి ఎందుకు తప్పుకున్నారనే విషయాన్ని ఇప్పటిదాకా ఎక్కడా రివీల్ చేయలేదు కాజల్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



