సేతుపతి ఆ పని చేసింది నయన్ కోసమేనా?
on Mar 4, 2023

సినిమా ఇండస్ట్రీలో కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్లకి జెండర్‌తో సంబంధమే ఉండదు. ఆడయినా, మగయినా ఎమోషన్స్ ఒకటే ఫ్రెండ్‌షిప్‌లో అని నమ్ముతారు. బాలీవుడ్‌లో షారుఖ్, కాజోల్ ఫ్రెండ్‌షిప్ అలాంటిదే. కోలీవుడ్‌లోనూ అలాంటి ఫ్రెండ్స్ ఉన్నారు. వారి పేరు నయనతార, విజయ్ సేతుపతి. కెరీర్ స్టార్టింగ్ నుంచీ కాకపోయినా, తనకు విఘ్నేష్ శివన్‌తో పరిచయమైనప్పటి నుంచీ విజయ్ సేతుపతితో ఫ్రెండ్లీగా ఉంటున్నారు నయన్. అదే చనువుతో రీసెంట్‌గా ఓ హెల్ప్ అడిగారట.
ఆమె అడగ్గానే ఎందుకు ఏమిటి అని ఆరా తీయకుండా యస్ అని చెప్పేశారట సేతుపతి. ఇంతకీ ఆ హెల్ప్ ఏంటి? అనేగా మీ అనుమానం... విఘ్నేష్ శివన్‌కి కాల్షీట్ ఇచ్చి సినిమా చేయమన్నదే ఆ హెల్ప్. నయన్ అడగగానే, అప్పటిదాకా సుందర్ సికి ఇచ్చిన కాల్షీట్ ని కేన్సిల్ చేసేశారట సేతుపతి. తనకున్న మార్కెట్ రీత్యా ఎక్కువ పారితోషికాన్ని డిమాండ్ చేశారట మిస్టర్ సేతుపతి. అంత ఇవ్వలేనని సుందర్ చెప్పడంతో, కాల్షీట్ అడ్జస్ట్ కావడం లేదని ప్రాజెక్ట్ నుంచి డ్రాప్ అయ్యారట. ఇప్పుడు అదే కాల్షీట్‌తో విఘ్నేష్‌తో మూవీ చేస్తున్నారట. విఘ్నేష్ తన పెళ్లి తర్వాత అజిత్ కుమార్‌తో సినిమా చేస్తారని అందరూ అనుకున్నారు.
అయితే ఏకే 62 సెట్స్ మీదకు వెళ్లలేదు. దీనికి రకరకాల కారణాలు వినిపించాయి. దాంతో సేమ్ స్టోరీతో విజయ్ సేతుపతితో ట్రావెల్ అవుతున్నారు. విఘ్నేష్‌కి సేతుపతిని డైరక్ట్ చేయడం ఇదే తొలిసారేం కాదు. నానుం రౌడీదాన్ సినిమాలో విజయ్ సేతుపతి, నయనతార జంటగా నటించారు. లాస్ట్ ఇయర్ విడుదలైన కాత్తువాక్కులే రెండు కాదల్ సినిమాలోనూ ఇదే జోడీ కనిపించారు. వీరితో పాటు సమంత కూడా కీ రోల్ చేశారు. ఇంతకీ ఇప్పుడు విఘ్నేష్ డైరక్ట్ చేస్తున్న విజయ్ సేతుపతి మూవీకి నయనతార కాల్షీట్ ఇచ్చారా? లేదా? అనేది కూడా అందరిలోనూ క్యూరియాసిటీ క్రియేట్ చేస్తున్న విషయం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



