కబాలి.. క్లయిమాక్స్ రక్త కన్నీరే
on Jul 21, 2016
మరికొద్ది గంటల్లో కబాలి ప్రభంజనం మొదలైపోనుంది. ఎక్కడ చూసినా... కబాలి ముచ్చట్లే. ఫస్ట్ లుక్ బయటకు వచ్చినప్పటి నుంచీ.. కబాలిపై పాజిటీవ్ బజ్ నడుస్తోంది. అందుకే.. రోజురోజుకీ హైప్ పెరుగుతూ వచ్చింది. అయితే తొలిసారి కబాలిపై నెగిటీవ్ టాక్ కూడా వినిపించడం మొదలైంది. మరీ ముఖ్యంగా క్లైమాక్స్ సీన్ గురించిన ఓ హాట్ న్యూస్ బయటకు వచ్చింది. కాబాలి క్లైమాక్స్ హ్యాపీ ఎండింగ్కాదట. కబాలి క్లైమాక్స్ దుఖాంతం అని తెలుస్తోంది. యాంటీ క్లైమాక్స్ సీన్లు తమిళ ప్రేక్షకులకు నచ్చుతాయేమో.. మిగిలిన వాళ్లు మాత్రం భరించలేరు. రజనీ అంటే కేవలం తమిళ సినిమాకాదు. యూనివర్సల్ గా ఆయనకు అభిమానులున్నారు. వాళ్లందరికీ క్లైమాక్స్ నచ్చుతుందా, లేదా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
అందుకే స్క్రిప్టు దశలోనే క్లైమాక్స్‌ని మార్చమని రజనీ కుమార్తె ఐశ్వర్య... దర్శకుడు రంజిత్ని కోరిందట. ఆయన కూడా క్లయిమాక్స్ మార్చడానికి సిద్ధమయ్యాడట. అయితే రజనీ జోక్యం చేసుకొని `నువ్వు ఎలా అనుకొంటే సినిమా అలా తీయ్. నా కోసం ఏమీ మార్చకు` అన్నాడట. దాంతో రంజిత్ తన స్క్రిప్టు ప్రకారం సినిమా తీసేశాడు. తీరా ఇప్పుడు క్లయిమాక్స్ చూసుకొంటే చిత్రబృందానికి టెన్షన్ పట్టుకొందని తెలుస్తోంది. ఇలాంటి యాంటీ క్లయిమాక్స్‌ని అభిమానులు జీర్ణం చేసుకొంటారా? అని వాళ్లే అనుమానిస్తున్నారని సమాచారం. కబాలి భవిష్యత్తు.. ఈ క్లయిమాక్సే నిర్ణయించనుందని తమిళ సినీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.