మున్నీపై సీరియస్ అయిన షీలా ఫ్యాన్స్!
on Jul 20, 2016
"భజరంగీ భాయిజాన్" సినిమాలో మున్నీ పాత్రలో థియేటర్ లోని ప్రేక్షకులందరి కళ్ళూ చెమర్చేలా చేసిన చిన్నారి హర్షాలి మల్హోత్రా గుర్తుంది కదా. ఈ చిట్టితల్లీ ఫేస్ బుక్ మరియు ట్విట్టర్ లో బాగా యాక్టివ్ గా ఉంటుంది. అయితే.. మొన్న కత్రినా పుట్టినరోజు సందర్భంగా "హ్యాపీ బర్త్ డే ఆంటీ" అని కత్రీనాకు ట్విట్టర్ లో శుభాకాంక్షలు తెలిపింది. కత్రినా కూడా చాలా సంతోషంగా "థ్యాంక్యూ లవ్" అంటూ రిప్లై ఇచ్చింది. కానీ.. 33 ఏళ్ళ కత్రినాను 8 ఏళ్ల హర్షాలీ "ఆంటీ" అని పిలిచినందుకు కత్రినా అభిమానులు మాత్రం విపరీతమైన హడావుడి చేశారు. చిన్నపిల్ల అని కూడా చూడకుండా తిట్టినతిట్టు తిట్టకుండా తిట్టారు. పాపం గ్రీటింగ్స్ చెప్పినందుకు ఈ రచ్చ ఏంటీ? అని హర్షాలి కూడా నెత్తి కొట్టుకొంది. మరీ వెటకారం కాకపోతే.. 33 ఏళ్ల ఆవిడను 8 ఏళ్ల బాలిక "ఆంటీ" అని కాకపోతే "అక్కా" అని పిలుస్తుందా ఏంటి?. అభిమానం ఉండొచ్చు కానీ.. మరీ చిన్నపిల్ల అని కూడా చూడకుండా అభిమానం పేరుతో తిట్టడం ఏంటో?