ENGLISH | TELUGU  

‘జై లవకుశ’లో ఆ సినిమాల పోలికలు?

on Sep 20, 2017

ఇప్పటికి వెండితెరపై వేల కథలు వచ్చుంటాయ్. మరి అన్ని కథలు తయారవ్వడం అంటే మామూలు విషయం కాదు కదా. వీటికోసం కచ్చితంగా రామాయణం, మహాభారతం, భాగవతం.. ఈ మూడు కాకపోతే... హాలీవుడ్ కథలు వీటిల్లో దేన్నో ఒకదాన్ని ఫాలో అవ్వాల్సిందే. ఈ కారణంగానే... ఓ కథకు, మరో కథకు అప్పుడప్పుడు పోలికలు కనిపిస్తుంటాయ్. ఇది తప్పని విషయం. తప్పు పట్టే విషయం కాదు. త్వరలో ఎన్టీయార్ ‘జై లవకుశ’ సినిమా రాబోతోంది. ఆ సినిమా కథలోని కీలక అంశాలు కొన్ని వెలుగు చూశాయ్. వాటిని తెలుసుకున్నాక.. గతంలో అదే పోలికలతో వచ్చిన కొన్ని సినిమాలు స్పురణకు వచ్చాయ్. వాటిని సరదాగా గుర్తు చేసుకుందాం.

అగ్గిపిడుగు

 

 

1964లో వచ్చిందీ సినిమా. ఇందులో ఎన్టీయార్ డ్యుయెల్ రోల్. కథ రిత్యా అభివక్త కవలలు. అతుక్కొని పుడతారు. ఒకడికి గాయమైతే.. రెండోవాడికి నొప్పి. ఒకడు కోపమొస్తే రెండోవాడు కొడుతుంటాడు. ఇలా ఉంటాయ్ పాత్రలు. ఈ క్రమంలో అన్న ఓ అమ్మాయిని ఇష్టపడతాడు. జన్యు కారణంగా.. తమ్ముడు మనసు కూడా అదే అమ్మాయి వైపు పోతుంటుంది. అదను చూసుకొని ఆ అమ్మాయి దగ్గరకెళ్తాడు.  అన్నగా నటించి, లోబరుచుకోవాలని చూస్తాడు. తర్వాత బుద్ధి తెచ్చుకుంటాడు.


నిర్దోషి

 

 

1967లో వచ్చిన ఈ సినిమాలో కూడా ఎన్టీయార్ ది డ్యూయెల్ రోలే. ఒకడు సాత్వికుడు కాకా, రెండోవాడు ప్రమాదకారి. కథ రిత్యా కొన్ని సందర్భాల్లో చెడ్డవాడైన ఎన్టీయార్.. మంచివాడి గెటప్పులో వచ్చి పనులు ముగించుకొని చక్కా పోతుంటాడు. ఈ కారణంగా మంచివాడు నిందలపాలవుతాడు. దోషిగా నిలబడి... తర్వాత నిర్దోషత్వాన్ని నిరూపించుకుంటాడు.


సొమ్మొకడిది సోకొకడిది

 

 

1978 లో వచ్చిందీ సినిమా. కమల్ హాసన్ హీరో. సింగీతం శ్రీనివాసరావు దర్శకుడు. కథ రిత్యా ఇద్దరూ మంచి వాళ్లే. అయితే.. ఒకడు కోటీశ్వరుడైన డాక్టర్ కాగా, ఒకడు కటిక పేద. ఈజీ మనీ కోసం ట్రై చేస్తుంటాడు. అలాంటి సమయంలో డాక్టర్ కమల్ హాసన్ ఊళ్లో లేని సమయం చూసి, అతని లాగా ఆ ఇంట్లోకి జొరబడతాడు. సకల సౌఖ్యాలు అనుభవిస్తాడు. తర్వాత డాక్టర్ కి దొరికిపోతాడు. సరదాగా సాగుతుందీ సినిమా.

వాలి

 

 

1999లో వచ్చిన ‘వాలి’ సినిమా దక్షిణాదిన పెను సంచలనం. ఈ కథ దాదాపు ఎన్టీయార్ ‘అగ్గి పిడుగు’నే పోలి ఉంటుంది. అందులో అన్న ప్రియురాలిపై తమ్ముడు మోజు పడితే... ఇందులో తమ్ముడి భార్యపై అన్న మోజు పడతాడు. అంతేకాదు.. తమ్ముడు లేని సమయం చూసి ఆమె సర్వస్వాన్ని దోచుకోబోతాడు. ఇందులో అన్నది పూర్తిగా నెగిటీవ్ రోల్. దుర్మార్గుడన్నమాట. ఒకే పోలికలతో ఉన్న ఇద్దరు అన్నదమ్ముల మధ్య నలిగిపోయిన ఓ స్త్రీ కథ ఇది. అజిత్ నటన నిజంగా సూపర్బ్. రెండు పాత్రలనూ పొంతన లేకుండా నటించాడు. ఇందులో అన్న పాత్ర మూగవాడు కావడం కూడా అజిత్ కి కలిసొచ్చింది. అందుకే అద్భుతంగా నటించాడు.


మన్మథ

 

 

2004లో వచ్చిన ‘మన్మథ’ శింబుకు దక్షిణాదిన మంచి గుర్తింపు తెచ్చిన సినిమా. ఇందులో శింబు ద్విపాత్రాభినయం చేశాడు. అయితే.. పైన చెప్పుకున్న సినిమాల్లోని కేరక్టరైజేషన్స్ కూ... ‘మన్మథ’లోని పాత్రల తీరుకు పోలిక ఉండదు.  ఇందులో తమ్ముడంటే అన్నకు ప్రాణం. తమ్ముడు ఓ అమ్మాయిని ప్రేమించి మోసపోతాడు. ఆ బాధ భరించలేక ఆత్మహత్య చేసుకుంటాడు. ఆ దారుణాన్ని ప్రత్యక్షంగా చూసిన అన్న చెలించిపోతాడు. ఆడజాతి మీదే అసహ్యం పెంచుకుంటాడు. తమ్ముడిగా మారిపోయి.. అమ్మాయిల్ని మోసం చేసి చంపుతుంటాడు. ఇది మరో  కోణం.

*జై లవకుశ*

 

 

ఈ సినిమా సెప్టెంబర్ 21న విడుదల కానుంది. ఇందులో ఎన్టీయార్ త్రిపాత్రాభినయం చేయడం విశేషం. అన్న ‘జై’..క్రూరుడు. దుర్మార్గుడు. అభినవ రావణుడు. పెద్ద తమ్ముడు లవకుమార్ బ్యాంక్ మేనేజర్. అతి మంచివాడు. కాస్త అమాయకత్వం కూడా. చిన్నతమ్ముడు కుశకుమార్... పెద్ద దొంగ. అల్లరి చిల్లరగా తిరుగుతుంటాడు. కృష్ణుడి టైపు. కథ రిత్యా... ‘జై’.. పలు సందర్భాల్లో తమ్ముళ్ల గెటప్పులో వచ్చి అనుకున్న కార్యాలను చక్కబెట్టుకెళ్తుంటాడని సమాచారం. ఈ కారణంగా లవకుశులిద్దరూ ఇబ్బందుల్లో పడతారట. అంతేకాదు.. ‘జై’ కథ రిత్యా కూడా మంచి నటుడట. నాటకాల పిచ్చి కూడా ఉంటుందట. ఇలా సరదగా ఆ పాత్రలు సాగుతాయని సమాచారం.

దీన్ని బట్టి చూస్తే... మనం ఇప్పటివరకూ చెప్పుకున్న సినిమాల మాదిరిగానే... ‘జై లవకుశ’ కూడా.. కేవలం అభిమానులకే కాకుండా సగటు ప్రేక్షకుడికి కూడా వినోదాల విందు వడ్డించడం ఖాయమని అర్థమవుతోంది. ఏమంటారు ఫ్రెండ్స్.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.