ఎన్టీఆర్‌పై రాజమౌళికి నమ్మకం లేదా?
on Mar 9, 2016

ఎన్టీఆర్ -రాజమౌళిలది సూపర్ హిట్ కాంబినేషన్. స్టూడెంట్ నెం.1, సింహాద్రి, యమదొంగ... హ్యాట్రిక్ విజయాల్ని నమోదు చేసుకొన్నారు. అసలు ఒకరి విజయ ప్రస్థానం మొదలైందే.. మరొకరితో. అందుకే ఈ జోడీ అంటే తెలుగు ప్రేక్షకులకూ ఎనలేని గురి! యమదొంగ తరవాత ఎన్టీఆర్‌తో సినిమా చేయలేదు రాజమౌళి. జక్కన్నతో జట్టు కట్టడానికి ఎన్టీఆర్ సిద్ధంగానే ఉన్నా.. ఈ విషయంలో రాజమౌళి మాత్రం నిర్ణయం తీసుకోలేకపోతున్నాడు. బాహుబలి 2 తరవాత రాజమౌళి సినిమా ఎన్టీఆర్‌తోనే అన్నది దాదాపుగా ఖాయమైపోయింది.
అయితే ఇప్పుడు కూడా రాజమౌళి.. ఎన్టీఆర్ తో సినిమా చేయాలా, వద్దా అని ఆలోచిస్తున్నాడట! గరుడ అనే సబ్జెక్ట్ ఎన్టీఆర్ కోసమే అని అనుకొన్నా, ఇప్పుడు ఆ ప్రాజెక్టు నుంచి డ్రాప్ అవ్వాలని రాజమౌళి భావిస్తున్నట్టు సమాచారం. ఎందుకంటే గరుడకు దాదాపు వేయి కోట్ల బడ్జెట్ అవసరం. ఆ కథలో ఎన్టీఆర్‌కి సరిపడినా, వేయి కోట్లు తిరిగి రాబట్టే సత్తా తారక్‌కి లేదన్నది రాజమౌళి భయం. అందుకే గరుడ స్థానంలో మరో కథ సిద్థం చేసుకొంటున్నాడని తెలుస్తోంది. ఈ విషయమై ఎన్టీఆర్ కూడా రాజమౌళిపై గుర్రుగా ఉన్నాడట. చేస్తే గరుడ చేద్దాం, లేదంటే మానేద్దాం అంటున్నాడట. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



