హాట్ భామలిద్దరు.. గెలిచిందెవరు?
on Mar 9, 2016

అనసూయ, రష్మి... ఇద్దరూ బుల్లి తెర హాట్ భామలే. జబర్‌దస్త్ పోగ్రామ్‌తో ఇద్దరూ క్రేజ్ సంపాదించుకొన్నారు. ఇద్దరూ ఇంచుమించుగా ఒకేసారి.. వెండి తెరపై అడుగుపెట్టి, అదృష్టాన్ని పరీక్షించుకొన్నారు. దాంతో అసనూయ, రష్మిలలో ఎవరు గెలుస్తారు, ఎవరు ఎక్కువగా మెప్పిస్తారు?? అనే ఆసక్తికరమైన చర్చ మొదలైంది. అనసూయ సోగ్గాడే చిన్నినాయనలో ఆకట్టుకొంది. కాసేపే అయినా తన ఒంపు సొంపులతో అలరించింది. కాకపోతే.. వయసైపోతుందన్న విషయాన్ని మాత్రం దాచిపెట్టలేకపోయింది. క్షణంలో అందుకు పూర్తి విరుద్ధమైన పాత్రలో కనిపించింది. ఇలాంటి సినిమాలకూ.. అనసూయ ని ఓ ఆప్షన్ గా తీసుకోవచ్చన్న అభిప్రాయం నిర్మాతల్లో కలిగింది.
మరోవైపు గుంటూర్ టాకీస్ సినిమాతో రష్మి రచ్చ రచ్చ చేసింది. అనుకొన్న దానికంటే ఎక్కువగా రెచ్చిపోయి షాక్ ఇచ్చింది. రష్మితో ఈ టైపు పాత్రలు చేయించుకోవచ్చా?? అని దర్శకులు కూడా.. ఓ డిసీజన్‌కి వచ్చేశారు. గుంటూరు టాకీస్‌కి నాలుగు డబ్బులొస్తున్నాయంటే.. అదంతా రష్మి చలవే అని చెప్పుకొంటున్నారు. మొత్తానికి అటు అనసూయ, ఇటు రష్మి.. ఉతికి ఆరేశారు. కాకపోతే పారితోషికం విషయంలో రష్మి కంటే అనసూయే ముందుంది. గ్లామర్ విషయంలో అనసూయ కంటే రష్మికే ఎక్కువ మార్కులు పడ్డాయి. మున్ముందు ఈ పోటీ ఇంకెంత రసవత్తరంగా సాగుతుందో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



