'జిలేబి' పబ్లిక్ టాక్.. 'నువ్వు నాకు నచ్చావ్' దర్శకుడు బాగానే నవ్వించాడు
on Aug 18, 2023

'స్వయంవరం', 'నువ్వే కావాలి', 'నువ్వు నాకు నచ్చావ్', 'మన్మథుడు', 'మల్లీశ్వరి'.. ఇలా ఒక దశలో వరుస విజయాలతో కుటుంబ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు దర్శకుడు కె. విజయ భాస్కర్. కట్ చేస్తే.. స్వల్ప విరామం తరువాత ఆయన మెగాఫోన్ పట్టి 'జిలేబి' అనే మూవీ తీశారు. తన కొడుకు శ్రీ కమల్ ని హీరోగా పరిచయం చేస్తూ కె. విజయ భాస్కర్ తెరకెక్కించిన ఈ సినిమాలో రాజశేఖర్, జీవిత కుమార్తె శివాని రాజశేఖర్ హీరోయిన్ గా నటించింది. మెలోడీబ్రహ్మ మణిశర్మ సంగీతమందించిన ఈ సినిమా శుక్రవారం (ఆగస్టు 18) జనం ముందుకొచ్చింది.

అబ్బాయిల హాస్టల్ లోకి ఓ అమ్మాయి ఎంటరయ్యాక ఏం జరిగిందనే పాయింట్ తో తెరకెక్కిన ఈ మూవీ ఆద్యంతం వినోదాత్మకంగా ఉందని.. మరీముఖ్యంగా సెకండాఫ్ లో రాజేంద్ర ప్రసాద్ బృందంపై చిత్రీకరించిన 'బ్లాక్ మ్యాజిక్' సీన్ బాగా నవ్విస్తుందని అంటున్నారు. శ్రీ కమల్ కిదే తొలి సినిమా అయినా.. కొన్ని సన్నివేశాల్లో ఈజ్ తో అలరించాడని చెప్పుకుంటున్నారు. శివాని తన పాత్రలో ఒదిగిపోయిందని.. మణిశర్మ నేపథ్య సంగీతం సినిమాకి ఓ ఎస్సెట్ అని అంటున్నారు. ఓవరాల్ గా.. 'నువ్వు నాకు నచ్చావ్' దర్శకుడు మరోసారి బాగానే నవ్వించాడన్నదే పబ్లిక్ టాక్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



