ENGLISH | TELUGU  

'జెట్టి'.. నాలుగు భాష‌ల్లో వ‌స్తున్న అరుదైన క‌థ‌!

on May 18, 2021

 

నందితా శ్వేత ప్ర‌ధాన పాత్ర‌ధారిగా వ‌ర్ధిన్‌ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై వేణుమాధ‌వ్ నిర్మిస్తోన్న చిత్రం 'జెట్టి'. ఈ చిత్రం ద్వారా సుబ్ర‌హ్మ‌ణ్యం పిచ్చుక ద‌ర్శ‌కునిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. మ‌త్స్య‌కారుల జీవితాల‌ను స్పృశిస్తూ, బ‌ల‌మైన క‌థ‌తో ఈ చిత్రం రూపొందుతోంది. తెలుగులో నిర్మాణ‌మైన ఈ చిత్రాన్ని త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం భాష‌ల్లోనూ విడుద‌ల చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ రోజు నాలుగు భాష‌ల్లో టైటిల్ లోగోను చిత్ర బృందం ఆవిష్క‌రించింది. 

స‌ముద్రాన్ని ఆధారంగా చేసుకొని జీవించే మ‌త్స్య‌కారులు త‌మ జీవితాలు బాగ‌వ‌డానికి 'జెట్టి' కోసం ఎలాంటి ప్ర‌య‌త్నాలు చేశారు, వారి ప్ర‌య‌త్నాల‌కు ఎలాంటి ఆటంకాలు క‌లిగాయి, రాజ‌కీయ నాయ‌కులు వారిని త‌మ స్వార్థం కోసం ఎలా వాడుకుంటార‌నే అంశాల‌కు చ‌క్క‌టి ప్రేమ‌క‌థ‌ను జోడించి ఈ చిత్రాన్ని ద‌ర్శ‌కుడు సుబ్ర‌హ్మ‌ణ్యం మ‌లిచారు. తండ్రీ కూతుళ్ల మ‌ధ్య బంధం ఈ సినిమాకు హైలైట్‌గా నిలుస్తుంది. ఆ పాత్ర‌ల్లో ఎం.ఎస్‌. చౌద‌రి, నందితా శ్వేత ఉన్న‌త స్థాయి న‌ట‌న‌ను ప్ర‌ద‌ర్శించారు. ఇప్ప‌టివ‌ర‌కూ ఈ త‌ర‌హా క‌థ తెలుగు సినిమా తెర‌పై రాలేదు.

ప్రపంచీక‌ర‌ణతో మారుతున్న జీవ‌న‌శైలిలో తాము న‌మ్ముకున్న స‌ముద్రం మీద ఆధారప‌డుతూ అల‌లతో పోటీప‌డుతూ పొట్ట పోసుకుంటున్న జీవితాల‌ను చాలా స‌హ‌జంగా తెర‌మీద ప‌రిచాడు ద‌ర్శ‌కుడు. అనాదిగా వస్తున్న ఆచారాలని నమ్ముకుంటూ, వాటి విలువల్ని పాటిస్తూ, సముద్రపు ఒడ్డున ఆవాసాలు ఏర్పాటు చేసుకుని, సముద్రపు అలలపైన జీవిత పయనం సాగించే మత్స్యకార గ్రామాలు ఎన్నో ఉన్నాయ్‌. అలాంటి ఒక గ్రామంలో జరిగిన కథ 'జెట్టి'. ఈ చిత్రం ద్వారా కృష్ణ హీరోగా ప‌రిచ‌యం అవుతున్నాడు. 


 
ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు సుబ్ర‌హ్మ‌ణ్యం పిచ్చుక మాట్లాడుతూ, "ఈ క‌థ మ‌నుషుల జీవితాల్లోంచి పుట్టింది. ప్ర‌పంచం ఎంత మారినా కొన్ని జాతులు అనాదిగా వ‌స్తున్న ఆచారాల‌ను న‌మ్ముకొని జీవ‌నం సాగిస్తున్నాయి. అలాంటి ఒక ఊరిలో జరిగిన క‌థ ఇది. ఇప్ప‌టి వ‌ర‌కూ ద‌క్షిణ‌ భార‌త‌దేశంలో నిర్మించ‌ని క‌థ ఇది. తెలుగుతో పాటు, క‌న్న‌డ‌, త‌మిళ మ‌రియు మ‌ళ‌యాణంలో రిలీజ్ చేస్తున్నాం. షూటింగ్ కంప్లీట్ చేసుకొని ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో ఉన్నాం.  కొన్ని వందల గ్రామాలు కొన్ని వేల మత్స్యకార కుటుంబాలు, కొన్ని త‌రాల పోరాటం, వారి క‌ల ఒక గోడ. ఆ గోడ పేరే 'జెట్టి'. ఈ అంశాన్ని  ప్రధానంశంగా తీసుకుని, దీనితో పాటు బయట ప్రపంచానికి చాలా తక్కువగా తెలిసిన అరుదయిన జాతి... సముద్రాన్ని నమ్ముకుంటూ, కడలికి కన్నబిడ్డల్లాగా, సముద్రానికి దగ్గరగా బతుకుతున్న జాతి.. మత్స్యకారులు. వీళ్ళ జీవన శైలిని వారి కఠినమయిన కట్టుబాట్లని చూపిస్తూ తెరకెకించిన ప్రతిష్టాత్మక చిత్రం 'జెట్టి'. ఈ సినిమాలో సిద్ శ్రీరాం పాట హైలెట్ గా నిలుస్తుంది. త్వ‌ర‌లోనే ఈ పాట‌ను విడుద‌ల చేస్తాం." అన్నారు.

తారాగ‌ణం: నందితా శ్వేత‌, కృష్ణ , క‌న్న‌డ కిషోర్, మైమ్ గోపి, ఎమ్.య‌స్. చౌద‌రి, శివాజీరాజా, జీవా, సుమ‌న్ శెట్టి తదితరులు.

బ్యానర్: వ‌ర్ధిన్‌ ప్రొడక్షన్స్
మ్యూజిక్: కార్తిక్ కొడ‌కండ్ల‌
డిఓపి: వీర‌మ‌ణి
ఆర్ట్: ఉపేంద్ర రెడ్డి
ఎడిటర్: శ్రీనివాస్ తోట‌
స్టంట్స్: దేవరాజ్ నునె
కోరియోగ్రాఫర్: అనీష్
పబ్లిసిటీ డిజైనర్: సుధీర్
డైలాగ్స్: శ‌శిధ‌ర్ 
పిఆర్ ఓ: జియస్ కె మీడియా
నిర్మాత: వేణు మాధ‌వ్ 
క‌థ‌, స్క్రీన్ ప్లే, డైరెక్ష‌న్: సుబ్ర‌హ్మ‌ణ్యం  పిచ్చుక.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.