మణిశర్మ వెబ్ సిరీస్ - బ్రహ్మగా సునీల్
on May 18, 2021

వేదిక ఏదైనా నాణ్యతకే పెద్దపీట వేసే సంగీత దర్శకుడిగా మెలోడీబ్రహ్మ మణిశర్మకి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఒకవైపు టాలీవుడ్ లో స్టార్ కంపోజర్ గా రాణిస్తూనే.. దాదాపు రెండు దశాబ్దాల క్రితం బుల్లితెర ధారావాహిక `జనని`కి సంగీతమందించారాయన. కట్ చేస్తే.. త్వరలో ఈ అగ్ర స్వరకర్త ఓ వెబ్ సిరీస్ తో సందడి చేయనున్నారు.
ఆ వివరాల్లోకి వెళితే.. గత ఏడాది ఆహా ఓటీటీలో `కలర్ ఫొటో`చిత్రంతో అలరించిన యూనిట్.. త్వరలో ఓ వెబ్ సిరీస్ తో పలకరించనుంది. ఈ సిరీస్ కే మణిశర్మ సంగీతమందించారు. సందీప్ రాజ్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ లో సునీల్, సుహాస్, శ్రీవిద్య, దివ్య శ్రీపాద, చాందిని రావు ప్రధాన పాత్రల్లో నటించారు. ఫాంటసీ టచ్ తో రూపొందిన ఈ వెబ్ సిరీస్.. ప్రధానంగా ముగ్గురు అమ్మాయిల చుట్టూ తిరుగుతుంది. కాగా, ఇందులో సునీల్ సృష్టికర్త బ్రహ్మ పాత్రలో దర్శనమివ్వనున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ సిరీస్ కి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి.
మరి.. వెబ్ సిరీస్ లోనూ మెలోడీబ్రహ్మ తనదైన ముద్రవేస్తారేమో చూడాలి. అలాగే.. బ్రహ్మ పాత్రలో సునీల్ ఏ స్థాయిలో ఆకట్టుకుంటారు? అన్నది కూడా ఆసక్తికరమే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



