ట్రిప్ క్యాన్సిల్ చేసుకున్న ‘జవాన్’ కెప్టెన్.. ఎందుకో తెలుసా?
on Sep 19, 2023
షారూక్ ఖాన్ హీరోగా అట్లీ రూపొందించిన ‘జవాన్’ వరల్డ్‌వైడ్‌గా ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఎన్నో రికార్డుల్ని అధిగమించే స్థాయిలో ‘జవాన్’ కలెక్షన్స్ ఉండడం విశేషం. ఈ సినిమా కోసం ఎంతో కష్టపడిన అట్లీ.. ఓ నాలుగు నెలలు సినిమాలకు దూరంగా వెళ్ళి హాలీడేస్‌ను ఎంజాయ్ చేద్దామనుకొని ముందే ప్లాన్ చేసుకున్నాడు. అయితే ‘జవాన్’ కోసం ఆ ట్రిప్‌ని క్యాన్సిల్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.
విషయం ఏమిటంటే ‘జవాన్’ చిత్రం థియేటర్లలో కలెక్షన్లు కుమ్మేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ పొందింది. 50 రోజుల తర్వాత ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఇక్కడ నెట్‌ఫ్లిక్స్ వారిని వేధిస్తున్న సమస్య ఒకటి ఉంది. అదేమిటంటే రొటీన్ స్టోరీని డిఫరెంట్‌గా ప్రజెంట్ చెయ్యడంతో థియేటర్లలో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దీన్నే ఓటీటీలో చూడాలంటే కొంచెం కష్టమేనని నెట్‌ఫ్లిక్స్ భావిస్తోందని తెలుస్తోంది. పైగా థియేటర్స్‌లో చూసిన వారు రెండోసారి ఈ సినిమాను చూడాలంటే కష్టమేనన్న భావన వారికుంది.
ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ను రూ.250 కోట్లకు కొనుగోలు చేసింది నెట్‌ఫ్లిక్స్. దానికి తగ్గట్టు వ్యూస్ రాబట్టుకోవాలంటే ఏదో ఒక మ్యాజిక్ జరిగితే గానీ అది సాధ్యం కాదని వారి ఉద్దేశం. అందుకే ఈ సినిమాకు కొత్త మెరుగులు దిద్దేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. అదేమిటంటే.. థియేటర్‌లో చూడని కొత్త సీన్స్‌ని ఓటీటీ వెర్షన్‌లో జతచెయ్యాలన్నది యూనిట్ ఆలోచన. దాని కోసం కసరత్తు మొదలు పెట్టారు. దీని గురించి డైరెక్టర్ అట్లీతో డిస్కస్ చేసినట్టు తెలుస్తోంది.
నాలుగు నెలలపాటు హాలీడేస్‌ను ఎంజాయ్ చేద్దామనుకున్న అట్లీకి ‘జవాన్’ రూపంలో అడ్డంకి ఎదురైంది. సినిమాకి సంబంధించి డిలీట్ చేసిన కొన్ని సీన్స్‌ను యాడ్ చెయ్యాలంటే అది డైరెక్టర్ ఆధ్వర్యంలోనే జరగాలి. కాబట్టి వెంటనే తన ట్రిప్‌ను క్యాన్సిల్ చేసుకున్నాడు అట్లీ. ఓటీటీలో కూడా ‘జవాన్’ పెద్ద విజయం సాధించాలంటే ఏయే సీన్స్‌ను యాడ్ చెయ్యాలి, ఈ సినిమాకి కొత్త లుక్ ఎలా తీసుకురావాలి అనేదానిపై దృష్టి పెట్టాడు ‘జవాన్’ కెప్టెన్.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
