Home

»

Latest News

Thalapathy Vijay: విజయ్ కి షాకుల మీద షాకులు.. దాని నుంచి ఇంకా తేరుకోకముందే...

Mar 01, 2026

  • దళపతి విజయ్ కి దెబ్బ మీద దెబ్బ
  • ఇప్పటికే విడాకుల కోసం కోర్టుమెట్లెక్కిన భార్య
  • ఇప్పుడు మరో షాకిచ్చిన కొడుకు 

రాజకీయాల్లో రాణించాలని చూస్తున్న కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్(Thalapathy Vijay)కి కుటుంబ పరంగా షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే భార్య సంగీత విడాకుల కోసం కోర్టును ఆశ్రయించగా, తాజాగా విజయ్ కుమారుడు జాసన్ సంజయ్(Jason Sanjay) తన తండ్రిని ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేయడం హాట్ టాపిక్ గా మారింది. 

విజయ్, సంగీత 1999లో పెళ్ళి చేసుకున్నారు. 26 ఏళ్ళ వివాహ బంధానికి స్వస్తి పలుకుతూ ఇప్పుడు విడాకులకు సిద్ధమయ్యారు. నిజానికి వీరు విడాకులు తీసుకోబోతున్నట్లు గతంలోనే వార్తలొచ్చాయి. ఆ వార్తలను నిజం చేస్తూ రీసెంట్ గా విజయ్ భార్య సంగీత కోర్టుని ఆశ్రయించారు. విజయ్ ఒక నటితో రిలేషన్ లో ఉన్నారని, అందుకే విడాకులు తీసుకుంటున్నట్లు ఆమె పేర్కొన్నారు.

తమిళ రాజకీయాల్లో సంచలనాలు సృష్టించాలని కలలు కంటున్న విజయ్ కి, ఎన్నికల ముందు విడాకుల కేసు అనేది పెద్ద దెబ్బ అని చెప్పవచ్చు. ఇది చాలదు అన్నట్టుగా విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ కూడా షాకిచ్చాడు.

విజయ్ ని ఇన్‌స్టాగ్రామ్‌లో సంజయ్ అన్‌ఫాలో చేయడం చూస్తుంటే.. తండ్రి వైపు కాకుండా, తల్లికి మద్దతుగా నిలవడానికి అతను సిద్ధమయ్యాడని అర్థమవుతోంది. కొడుకు చేసిన పనితో.. భార్యాభర్తలు మధ్య విభేదాల్లో విజయ్ దే తప్పనే సంకేతాలు జనాల్లోకి బలంగా వెళ్లే అవకాశముంది.

అందుకే విజయ్ ఫ్యాన్స్ సంజయ్ తీరుని తప్పుబడుతున్నారు. తండ్రిపై కోపముంటే సైలెంట్ గా ఉండాలి కానీ, ఇలా తొలి ఎన్నికలకు ముందు ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించడం కరెక్ట్ కాదని కామెంట్స్ పెడుతున్నారు.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com