Home

»

Latest News

దుబాయ్‌లో చిక్కుకున్న సోనాల్‌ చౌహాన్‌.. పీఎం మోడీ హెల్ప్ చేస్తారా?

Mar 01, 2026

ప్రముఖ నటి సోనాల్‌ చౌహాన్‌ (Sonal Chauhan) దుబాయ్‌లో చిక్కుకున్నారు. ఇరాన్‌–ఇజ్రాయెల్‌ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా విమాన సర్వీసులు రద్దయ్యాయని, భారత్‌కు సురక్షితంగా చేరుకునేందుకు సహకారం అందించాలి అంటూ ప్రధాని నరేంద్ర మోడీకి ఆమె సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేశారు. (Iran Israel war)

"గౌరవనీయ ప్రధాని నరేంద్ర మోడీ జీ.. ప్రస్తుత సంక్షోభం నేపథ్యంలో నేను దుబాయ్‌లో చిక్కుకుపోయాను. భారత్‌కు తిరిగి వచ్చేందుకు ఇప్పుడు సరైన మార్గం లేదు. నేను సురక్షితంగా ఇంటికి చేరుకునేందుకు సహకారం అందించాలి" అని సోనాల్‌ చౌహాన్‌ ట్వీట్ చేశారు. ఈ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

కాగా, హాలీడే ట్రిప్‌ కోసం కొన్ని రోజుల క్రితం దుబాయ్‌ కి వెళ్ళిన సోనాల్‌.. ప్రస్తుతం విమానాల రద్దు వల్ల అక్కడ చిక్కుకున్నట్లు సమాచారం.

మరోవైపు, భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు కూడా దుబాయ్ విమానాశ్రయంలో చిక్కుకున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో విదేశాల్లో ఉన్న భారతీయుల రాకపోకలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. తాజా పరిణామాలపై కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

Also Read: విరోష్ సెలబ్రేషన్స్.. దేశవ్యాప్తంగా అన్నదానం, స్వీట్స్ పంపిణీ!

?s=20

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com