Home

»

Latest News

విజయ్ కి షాక్ ఇచ్చిన సంగీత.. ఆ నటి ఈమె నేనా!

Feb 28, 2026


-ఇళయ దళపతి విజయ్ కి షాక్ ఇచ్చిన వైఫ్ సంగీత 
-ఎలక్షన్స్ టైంలోనే ఎందుకు!
-సంగీత నిజంగానే మానసిక క్షోభ అనుభవించిందా!
-ఆమె చెప్తున్న నటి ఎవరు!

ఇళయ దళపతి 'విజయ్'(Vijay).. ఈ పేరు వినపడితే చాలు తమిళనాడు మొత్తం ఆనందంతో  పులకరించిపోతుంది. ఒక్క తమిళనాడే కాదు విజయ్ అనే పేరుకున్న ప్రకంపనలు తెలుగునాట కూడా తిష్ట వేసుకొని కూర్చున్నాయంటే అతిశయోక్తి కాదు. అందుకు నిదర్శనం విజయ్ పుట్టిన రోజుతో పాటు సినిమా రిలీజ్ రోజు కనపడే బ్యానర్స్. అంతలా  సినీ రంగంలో మూడు దశాబ్దాల నుంచి మకుటం లేని మహారాజు గా కొనసాగుతూ వస్తున్నాడు. రాజకీయాల్లోకి కూడా ప్రవేశించడంతో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తాడనే నమ్మకంతో వాళ్లంతా ఉన్నారు. ఈ క్రమంలో విజయ్ కి తన భార్య నుంచి ఎదురైన సమస్యతో వాళ్లంతా ఉలికిపాటుకి  గురవుతున్నారు. ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం.

విజయ్ భార్య పేరు సంగీత(Sangeetha). నిన్న ఆమె విజ‌య్ నుంచి విడాకులు కోరుతూ చెంగల్ పట్టు జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సదరు పిటిషన్ లో 'విజయ్ కి ఒక నటితో  వివాహేతర సంబంధం ఉంది. ఆమెతో రిలేషన్ ని క్యాన్సిల్ చేసుకుంటున్నాని నాకు మాట ఇచ్చాడు. కానీ ఆ మాట తప్పి రిలేషన్ ని కంటిన్యూ చేసాడు. దాంతో విజయ్ ప్రవర్తన వల్ల లాస్ట్ టూ ఇయర్స్ నుంచి  తీవ్ర మానసిక వేదనని అనుభవించాను. ఇప్పుడు వేరే దారి లేక  విడిపోవడానికి సిద్ధపడుతున్నానని సంగీత తన డైవర్స్ పిటిషన్ లో స్పష్టంగా పేర్కొంది.ఈ నేపథ్యంలో ఏప్రిల్ 20న విచారణకి హాజరు కావాలని కోర్టు  విజయ్ కి నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది.


also read:  vishnu vinyasam: నో లిప్ లాక్.. శ్రీ విష్ణు అయితే మాత్రం 

కొన్ని రోజుల క్రితం విజయ్ ని ఉద్దేశించి తమిళనాడు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు నాగేంద్రన్(Nagendran)మాట్లాడుతు 'త్రిష(Trisha)ఇంటి నుంచి విజయ్ బయటకి రావాలనే సంచలన వ్యాఖ్యలు చేసాడు.ఆ వ్యాఖ్యలని ఇటీవల విజయ్ ఖండిస్తూ భావోద్వేగానికి లోనయ్యి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ క్రమంలో విజయ్ మరో నటితో సన్నిహితంగా ఉండటం వల్లే విడాకులు కోరుతున్నాని భార్య సంగీత తెలపడం గమనార్హం. అభిమానులైతే ఈ విషయంలో చాలా టెన్షన్ గా ఉన్నారు. విజయ్, సంగీత 1999లో పెళ్లి చేసుకోగా ఆ ఇద్దరిది ప్రేమ వివాహం. జాసన్ సంజయ్, దివ్యసాష అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.  ప్రెజెంట్ యావత్ భారతదేశం మొత్తం విజయ్ స్పందన కోసం ఎదురుచూస్తూ ఉంది.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com