Home

»

Latest News

Virosh: సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక ఆహ్వానం.. విరోష్ పెళ్లి రిసెప్షన్ కి ఫ్యాన్స్ కి నో ఎంట్రీ!

Mar 01, 2026

టాలీవుడ్ లవ్ బర్డ్స్ విజయ్ దేవరకొండ(Vijay Deverakonda), రష్మిక మందన్న(Rashmika Mandanna) ఫిబ్రవరి 26న వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఉదయ్‌పూర్‌లో కుటుంబసభ్యులు, అతి కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో ఈ వివాహ వేడుక జరిగింది. 

మార్చి 4న హైదరాబాద్‌లో విజయ్-రష్మిక వివాహ రిసెప్షన్ ఘనంగా జరగనుంది. ఈ వేడుకకు సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన పలువురు ప్రముఖులను ఆహ్వానిస్తున్నట్లు సమాచారం. (Virosh wedding reception)

తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబసభ్యులను కలిసి తమ వివాహ రిసెప్షన్ కు హాజరు కావాలని రష్మిక ప్రత్యేకంగా ఆహ్వానించడం విశేషం. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి సతీమణి.. రష్మికకు బొట్టు పెట్టి, నూతన వస్త్రాలను బహుకరించారు.

ఇదిలా ఉంటే ఆహ్వానం లేకుండా ఈ కార్యక్రమానికి వచ్చి ఇబ్బందులు పడవద్దని అభిమానులను విజయ్, రష్మిక కోరారు. ఈ మేరకు వారి టీమ్ కీలక ప్రకటన చేసింది.

"విరోష్ వెడ్డింగ్ రిసెప్షన్ కు పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నారు. కొద్దిమంది సన్నిహితులు, పరిమిత సంఖ్యలో గెస్ట్ లు రిసెప్షన్ లో పాల్గొననున్నారు. ఇన్విటేషన్ లేని వారు ఈ రిసెప్షన్ కార్యక్రమానికి రావొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. పోలీస్ ల ఆంక్షల నేపథ్యంలో ఆహ్వానం లేకుండా ఇతరులు, అభిమానులు ఈ కార్యక్రమానికి రావొద్దని, వచ్చి ఇబ్బందుల పాలు కావొద్దని విరోష్ జంట కూడా కోరుతున్నారు." టీమ్ తెలిపింది.

 

?s=20

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com