విజయ్ జోడీగా జాన్వి?
on Dec 28, 2019
విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ 'ఫైటర్' అనే సినిమాని ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. విజయ్ను యాక్షన్ స్టార్‌గా చూపించనున్న ఈ మూవీలో హీరోయిన్గా శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ నటించే అవకాశాలున్నాయని గట్టిగా వినిపిస్తోంది. ఇప్పటికే ఆమెను జగన్ సంప్రదించాడనీ, ఆమె కూడా ఈ సినిమాపై ఆసక్తి కనపరించిందనీ బాలీవుడ్లో ప్రచారం జరుగుతోంది. గతంలో టాలీవుడ్లో విజయ్ అంటే అభిమానమనీ, అతనితో కలిసి నటించే ఛాన్స్ వస్తే వదులుకోననీ జాన్వి చెప్పిన విషయం గమనార్హం. అయితే క్యారెక్టర్ విషయంలో ఆమె పర్టిక్యులర్‌గా ఉంటోందనీ, 'ఫైటర్'లో తనకు ఆఫర్ చేసిన క్యారెక్టర్ విషయంలో ఆమె సంతృప్తి చెందిందని కూడా చెప్పుకుంటున్నారు. ఈ సినిమా కోసం ఆమెకు ఏకంగా 3.5 కోట్ల రూపాయల భారీ రెమ్యూనరేషన్ ఇచ్చేందుకు కూడా జగన్ అంగీకరించాడంటున్నారు. జాన్వి ఈ సినిమాలో నటించడం ఖాయమైతే, దక్షిణాదిలో ఆమె నటించే తొలి సినిమా ఇదే అవుతుంది. ఇద్దరు హీరోయిన్లు ఉండే ఈ మూవీలో మరో హీరోయిన్గా అనన్యా పాండే పేరు వినిపిస్తోంది.
జాన్వి హైదరాబాద్‌కే చెందిన బాలీవుడ్ యాక్టర్ విజయ్ వర్మ జోడీగా 'ఘోస్ట్ స్టోరీస్' అనే నాలుగు సెగ్మెంట్ల సిరీస్‌లో ఒక సెగ్మెంట్లో నటించింది. నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చే ఈ సెగ్మెంట్‌కు జోయా అఖ్తర్ డైరెక్ట్ చేసింది. ఇది కాకుండా ఆమె నటించిన 'గుంజన్ సక్సేనా', 'రూహి అఫ్జా' సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. కార్తీక్ ఆర్యన్‌తో 'దోస్తానా 2' సినిమా చేస్తోంది. మరోవైపు విజయ్ దేవరకొండ 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమా చేస్తున్నాడు. అది పూర్తయిన వెంటనే 'ఫైటర్' చేసేందుకు రెడీ అవుతున్నాడు.