మగవాళ్ళకి పీరియడ్స్ వస్తే ఏం చేస్తారో తెలుసా!
on Apr 19, 2025
ఎన్టీఆర్(Ntr)తో కలిసి 'దేవర'లో మెప్పించిన 'జాన్వీ కపూర్'(Janhvi Kapoor)ప్రస్తుతం రామ్ చరణ్(Ram Charan)తో 'పెద్ది'(Peddi)మూవీ చేస్తుంది. 'దేవర'లో తన అందంతో, నటనతో ప్రేక్షకులని మెప్పించిన 'జాన్వీ' పెద్ది తో అగ్ర హీరోయిన్ రేంజ్ కి వెళ్తుందని అభిమానులు నమ్ముతున్నారు.
రీసెంట్ గా జాన్వీ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతు 'నెలసరి సమయంలో మహిళలు శారీరకంగా మానసికంగా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటారు. ఆ సమయంలో ఎదుర్కొనే బాధ వర్ణనాతీతం. నొప్పిని చులకనగా చూస్తే మరింత బాధగా ఉంటుంది. నాకు పీరియడ్స్ సమయంలో మూడ్ స్వింగ్స్ ఎక్కువగా వస్తాయి. నా మాటల్ని బట్టి నేను పీరియడ్స్ లో ఉన్నానని ఎదుటి వాళ్ళకి ఆర్డమైపోతుంది. దాంతో పీరియడ్స్ చాలా చిన్న విషయమైనట్టుగా నీకు ఆ సమయమా అని అడుగుతారు. ఆ మాటలకి కూడా చిరాకు వస్తుంది. కానీ ఆ బాధని అర్ధం చేసుకున్న వాళ్ళు మనకి ప్రశాంతత కలిగేలా ప్రవర్తిస్తారు. ఒక వేళ మగవాళ్ళకి పీరియడ్స్ వస్తే ఆ నొప్పిని భరించలేక అణుయుద్దాలు జరిగివేమో అని చెప్పుకొచ్చింది.
2018 లో బాలీవుడ్(Bollywood)లో 'ధఢక్' అనే మూవీతో సినీ రంగ ప్రవేశం చేసిన జాన్వీ ఇప్పటి వరకు హిందీలో సుమారు తొమ్మిది చిత్రాల వరకు చేసింది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
