టెన్షన్‌లో.... జనతా గ్యారేజ్
on Aug 22, 2016
ఎన్టీఆర్ అభిమానులంతా సెప్టెంబరు 2 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే భారీ అంచనాల మధ్య జనతా గ్యారేజ్ విడుదలయ్యేది ఆరోజే. ఆగస్టు 12న రావల్సిన జనతా గ్యారేజ్.. అనివార్య కారణాల వల్ల వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సినిమా అనుకొన్న సమయంలోనే పూర్తవుతోంది. సెప్టెంబరు 2న విడుదల అవ్వడం వెనుక ఎలాంటి అనుమానాలూ లేవు. కానీ సెప్టెంబరు 2 అనే తేదీనే చిత్రబృందాన్ని భయపెడుతోంది. ఎందుకంటే సరిగ్గా అదే రోజున వామపక్షాలు దేశ వ్యాప్తంగా బంద్‌కు పిలుపునిచ్చాయి. తెలుగు రాష్ట్రాలలో బంద్ ప్రభావం పెద్దగా కనిపించకపోయినా... కేరళలో మాత్రం బలంగా ఉండే అవకాశాలున్నాయి. ఈ సినిమా కేరళలో భారీ ఎత్తున విడుదల కానుంది. 2వ తేదీనే బంద్ అయితే.. ప్రారంభవసూళ్లకు భారీ గండి పడే అవకాశం ఉంది. అందుకే... చిత్రబృందం ఇప్పుడు టెన్షన్ లోపడింది. బంద్ ప్రభావాన్ని తగ్గించడానికి ఒక్కటే మార్గం. ఈసినిమాని ఒకరోజు ముందు అంటే సెప్టెంబరు 1న విడుదల చేయడమే. ఈ విషయమే ఎన్టీఆర్.. చిత్రబృందంతో మంతనాలు సాగిస్తున్నాడని వినికిడి. సెన్సార్ అనుకొన్న సమయంలో జరిగితే.. విడుదల తేదీని ఒకరోజు ముందుకు జరిపే అకాశాలున్నాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



