బాహుబలి 2లో బలిపశువు అనుష్క?
on Aug 22, 2016

బాహుబలి టీమ్ లో అంతర్గత కుమ్ములాటలు మొదలయ్యాయా?? అనుష్కని బలిపశువుని చేస్తున్నారా? అవుననే అనిపిస్తోంది... జరుగుతోన్న వ్యవహారం చూస్తుంటే. బాహుబలి లో అనుష్క కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఫస్టాఫ్‌లో డీ గ్లామరస్ గా కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది. సెకండాఫ్‌లో అనుష్క పాత్ర కీలకం కానున్నదని, బాహుబలి ది కన్‌క్లూజన్‌లో అనుష్క అదరగొట్టడం ఖాయమని చెప్పుకొన్నారు. అనుష్క కూడా ఇదే మాట చెప్పింది. అయితే.. పార్ట్ 2లో కూడా అనుష్క పాత్ర అంతంత మాత్రమేనట. అనుష్క కోసం రాసుకొన్న సన్నివేశాల్ని స్క్రిప్టు దశలోనే ట్రిమ్ చేసేశారట. దానికి కారణం.. అనుష్క బొద్దుగా మారడమే అని తెలుస్తోంది. బాహుబలి సినిమా మొదలయ్యేటప్పటికి అనుష్క స్లిమ్‌గా ఉంది. అయితే ఆ తరవాత బొద్దుగా మారింది. బరువు తగ్గమని రాజమౌళి ఎన్నిసార్లు సూచించినా, జేజమ్మ ఖాతరు చేయలేదట. ఇలాంటి పర్మనాలిటీతో అనుష్క యుద్దాలు చేయడం, గుర్రపు సవారీలు చేయడం కుదరదు గనుక... ఆ పాత్ర నిడివి బాగా తగ్గించేశారని తెలుస్తోంది. ఆ స్థానంలో తమన్నా పాత్రని పెంచుకొంటూ వెళ్లారట. నిజానికి బాహుబలి పార్ట్ 2లో తమన్నా పాత్ర అంతంతమాత్రమే. అయినా సరే.. అనుష్క పాత్ర నిడివి తగ్గడం వల్ల ఈసినిమాలో గ్లామర్ పాళ్లు కనుమరుగయ్యే ప్రమాదం ఉంది గనుక.. తమన్నా పాత్రని పెంచుకొంటూ వెళ్లారని తెలుస్తోంది. తమన్నాపై ప్రేమో, అనుష్కపై కోపమో తెలీదుగానీ.. ఈ సినిమా కోసం మాత్రం అనుష్కకి తీవ్ర అన్యాయం చేస్తున్నారు. పాపం.. జేజమ్మ.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



