'జామ్ జామ్ జజ్జనక' పాట వచ్చేసింది.. తమ్ముళ్ళూ ఇక సెలబ్రేట్ చేసుకోవడమే తరువాయి!
on Jul 11, 2023

మెగాస్టార్ 'భోళా శంకర్' నుంచి కొత్త పాట వచ్చేసింది. "జామ్ జామ్ జామ్ జజ్జనక" అంటూ సాగే ఈ పాట యూట్యూబ్ ముంగిట యూనిట్ చెప్పిన టైంకే నిలిచింది. "డప్పేసుకో.. దరువేసుకో.. వవ్వారే అదిరే పాటేసుకో" అంటూ మొదలై ఆపై "జామ్ జామ్ జామ్ జజ్జనక.. తెల్లార్లు ఆడుదాం తైతక్క" అంటూ హుషారు పెంచింది. మధ్యలో "తమ్ముళ్ళూ మనకు కొంచెం ఛేంజ్ కావాలమ్మా.. దరువు మార్చి కొత్త సౌండ్ వేసుకోండి" అంటూ చిరు మాటలు తోడయ్యాక.. పాపులర్ ఫోక్ సాంగ్ "నర్సపల్లి గండిలోని గంగధారి" నుంచి స్ఫూర్తి పొందినట్లుగా "నర్సపల్లి గండిలోని గంగధారి నాటుపిల్లి కలిసినాది గంగధారి" అనే లిరిక్స్ తో సాగి మరింత జోష్ పెంచింది. మొత్తమ్మీద.. 'భోళా శంకర్' చిత్ర బృందం ప్రకటించినట్టే ఇది పక్కా సెలబ్రేషన్ సాంగ్ అనే చెప్పొచ్చు.
చిరంజీవి, తమన్నా, కీర్తి సురేశ్, సుశాంత్ బృందంపై చిత్రీకరించిన ఈ గీతానికి మహతి స్వరసాగర్ సంగీతం, అనురాగ్ కులకర్ణి - మంగ్లి గానం, కాసర్ల శ్యామ్ సాహిత్యం ఆకర్షణలుగా నిలిచాయి. "నర్సపల్లి" మాతృకని ఆలపించిన గాయనీమణుల్లో ఒకరైన మంగ్లి ఈ పాటలోనూ భాగమవడం విశేషం. ఇక తన తండ్రి మణిశర్మ పుట్టినరోజునే మహతి స్వరసాగర్ ట్యూన్ చేసిన ఈ ఇన్ స్టంట్ చార్ట్ బస్టర్ రిలీజవ్వడం మరో విశేషం. మొత్తమ్మీద.. 'భోళా శంకర్' నుంచి అదిరిపోయే పాటైతే వచ్చిందనే చెప్పొచ్చు.
కాగా, మెహర్ రమేశ్ దర్శకత్వం వహిస్తున్న 'భోళా శంకర్'.. ఆగస్టు 11న థియేటర్స్ లోకి రానుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



