
సౌత్ ఇండియా మోస్ట్ అవైటెడ్ సీక్వెల్స్‌లో ఒకటైన 'జైలర్ 2' బాక్సాఫీస్ దగ్గర దండయాత్ర మొదలుపెట్టకముందే సరికొత్త చరిత్ర సృష్టించింది. కేవలం వరల్డ్ వైడ్ థియేట్రికల్ హక్కులతోనే ఏకంగా రూ.325 కోట్ల బిజినెస్ నమోదు చేసి కోలీవుడ్ వర్గాలను, ట్రేడ్ పండితులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
ఈ ఊహించని రేంజ్ బిజినెస్‌కి అసలు కారణం.. సీక్వెల్ ఫ్యాక్టర్, పార్ట్-1 సాధించిన భారీ విజయం. 2023లో రజినీకాంత్ - నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్‌లో వచ్చిన 'జైలర్' ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో తెలిసిందే. అప్పటివరకు వరుస ఫ్లాపులతో ఉన్న రజినీకి, 'బీస్ట్' రిజల్ట్‌తో డల్ అయిన నెల్సన్‌కి ఈ సినిమా ఫుల్ జోష్ ఇచ్చింది. టైగర్ ముత్తువేల్ పాండియన్‌గా రజినీ స్వాగ్, అనిరుధ్ అందించిన 'హుకుమ్' బీజీఎమ్స్ థియేటర్లను ఊపేశాయి.

ఇప్పుడు అదే క్రేజీ కాంబినేషన్ మళ్ళీ రీ-యూనియన్ అవుతుండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. రాబోయే అక్టోబర్ 15, 2026 న గ్రాండ్‌గా రిలీజ్‌కు సిద్ధమవుతున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ పై బిజినెస్ వర్గాలు కోటానుకోట్ల రూపాయలు పెడుతున్నాయి. ఈ మూవీ వరల్డ్ వైడ్ గా రూ.325 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసింది. బ్రేక్ ఈవెన్ సాధించాలంటే రూ.325 కోట్లకు పైగా షేర్ లేదా రూ.650 కోట్ల గ్రాస్ రాబట్టాల్సి ఉంది.
పాజిటివ్ టాక్ వస్తే 'జైలర్-2'కి ఇది అసలు పెద్ద టార్గెట్ కూడా కాదు. ఎందుకంటే జైలర్ మూవీనే రూ.600 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది. అలాంటిది రూ.650 కోట్లు కలెక్ట్ చేయడం 'జైలర్-2'కి పెద్ద కష్టమేమి కాదు. పైగా, కోలీవుడ్ చరిత్రలోనే మొదటి రూ.1000 కోట్ల మార్క్‌ను టచ్ చేసే సత్తా ఉన్న ప్రాజెక్ట్‌గా 'జైలర్ 2'ని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఇది కూడా చదవండి: అప్పుడు దేవర.. ఇప్పుడు ప్యారడైజ్.!
[Jailer 2 Pre Release Business, Jailer 2 Break Even Target, Jailer 2 Business, Rajinikanth, Nelson Dilipkumar, Anirudh Ravichander, Telugu Film News, Telugu News]




