తారక్ ని తెగ పొగిడేసిన బాలయ్య, మోక్షజ్ఞ?
on Sep 16, 2017
జరగంది జరిగితే.. అది వార్త. అదే సన్సేషన్. అందుకే... జరగకపోయినా...జరిగినట్లు రాసేసి.. ఇన్ స్టెంట్ సన్సేషన్ ని సృష్టించేస్తుంటుంది మీడియా. ప్రస్తుతం అలాంటి వార్తే ఒకటి షోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. బాలకృష్ణ, మోక్షజ్ఞా.. ‘జై లవకుశ’సినిమా కొంత పార్ట్ చూశారట. కల్యాణ్ రామ్ వీరికోసం ప్రత్యేకంగా సినిమాను వేశారట. సినిమా చూసిన బాలయ్య...చాలా ఆనందించి.. మా అబ్బాయిలిద్దరూ చేసిన ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలి. నిజంగా తారక్ చాలా బాగా చేశాడు. మూడు పాత్రలనూ పొంతన లేకుండా నటించాడు’ అని తారక్ ని తెగ పొగిడేశాడట. మోక్షజ్ఞ అయితే... ‘తారక్ అన్నయ్య నిజంగా సూపర్’ అని కొనియాడాడట. ఇది మొత్తంగా ఆ వార్త సారాంశం.
దీన్ని వార్త అనకూడదు. ఎందుకంటే... ఇదంతా శుద్ధ అబద్ధం. దీన్ని రూమర్ అంటారు. అంటే గాలి వార్త అన్నమాట. అసలే... బాలయ్యకీ.. తారక్ కీ మధ్య పచ్చి గడ్డి వేస్తే భగ్గు మనే పరిస్థితి. ఇలాంటి తరుణంలో... వారిద్దరూ కలిసిపోయినట్లు వార్తలు రాస్తే.. అది నిజమనుకొని అందరూ చదివేస్తారనీ.. వ్యూస్ పెరుగుతాయని వీళ్ల ప్లాన్. నిజానికి అదే జరిగితే... నందమూరి అభిమానులకు అంతకు మించిన ఆనందం మరొకటి ఉండదేమో!