ప్రభాస్ సినిమా..దిల్‌రాజుపై కేసు నమోదు
on Sep 17, 2017
.jpg)
చిత్ర పంపిణీదారుడు, సినీ నిర్మాత దిల్‌రాజుపై కేసు నమోదైంది. ముమ్మిడి శ్యామలా రాణి 2006లో రాసిన నా మనసు కోరింది నిన్నే నవల ఆధారంగా తన అనుమతి తీసుకోకుండా ప్రభాస్ హీరోగా మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా తీశారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 2011లో ఆగస్టులో రిలీజైన ఈ మూవీ ఘన విజయం సాధించింది. సినిమాలో ప్రతీ సీను తన నవలలో ఉన్నట్లుగానే చిత్రీకరించారని శ్యామల ఆరోపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిర్మాత దిల్‌రాజు, దర్శకుడు దశరథ్ సహా మరో ఇద్దరిపై 120ఎ, 415, 420లతో పాటు కాపీరైట్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. అయితే సినిమా విడుదలైన ఇన్నేళ్ల తర్వాత కేసు వేయటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



