ఓటిటి మూవీ 'జగమే మాయ' రివ్యూ!
on Dec 24, 2022

తారాగణం: ధన్య బాలకృష్ణ, తేజ ఐనంపూడి, చైతన్య రావు
దర్శకత్వం: సునీల్ ఉప్పాల
ఓటిటి: డిస్నీ ప్లస్ హాట్ స్టార్
ఇప్పుడు ఓటిటి ప్లాట్ ఫాం లో సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాల హవా నడుస్తుంది. అదే కోవలోకి సరికొత్త సినిమా వచ్చేసింది. అదే 'జగమే మాయ'. ఇప్పుడు ఈ సినిమా బెస్ట్ థ్రిల్లర్ సస్పెన్స్ గా ప్రేక్షకులను ఆకర్షిస్తోంది. రీసెంట్ గా ఓటిటిలో రిలీజ్ అయిన ఈ సినిమాలో కథని తెర మీద చూపించిన విధానం అల్టిమేట్ అనే చెప్పాలి.
బేవర్స్ గా తిరుగుతూ, పబ్ లో తాగుతూ, జులాయిగా బెట్టింగ్ వేస్తూ మొదలైన ఆనంద్ క్యారెక్టర్ కాస్త జోకర్ గా మారిపోతుంది. భర్త చనిపోయి డిప్రెసెషన్ లో ఉన్న క్యారెక్టర్ గా చిత్ర పరిచయమవుతుంది. చిత్ర వెనుక ఉన్న కోట్ల ఆస్తిని చూసి ఎలాగైనా దక్కించుకోవాలని, తనని మాయ చేసి పెళ్ళి చేసుకుంటాడు. ఆ తర్వాత కొన్ని రోజులు బాగానే సాగిపోతాయి. అయితే ఒకరోజు ఆనంద్ నిద్రలేవకుముందే, చిత్ర మీటింగ్ ఉందంటూ హడావిడిగా బయల్దేరుతూ ఉండగా, బీరువా దగ్గర కొంచెం టెన్షన్ గా ఏదో దాచిపెడుతున్నట్టుగా ఆనంద్ కి అనుమానం వస్తుంది. చిత్ర ఆఫీస్ కి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత బీరువాలో చూస్తే ఒక పెన్ డ్రైవ్ కనిపిస్తుంది. అది ఏంటని ల్యాప్‌టాప్ కి కనెక్ట్ చేసి చూస్తాడు. అప్పుడే అసలు ట్విస్ట్ బయటపడుతుంది. ఒక ఫోన్ సంభాషణలో 'చిత్ర..తన భర్తని చంపేయమని చెప్తుంది' ఇది విని ఆనంద్ షాక్ అవుతాడు. ఆ తర్వాత హీరోయిన్ వచ్చిందని మళ్ళీ అది ఎక్కడ ఉందో అక్కడే పెట్టేసి కంగారుపడుతుంటాడు. మళ్ళీ చిత్ర వచ్చి ఆ పెన్ డ్రైవ్ ని తీసుకొని ఆఫీస్ కి వెళిపోతుంది. ఇలా ఫస్ట్ ఆఫ్ ట్విస్ట్ తో పూర్తి అవుతుంది.
ఇప్పుడు అసలు కథ మొదలవుతుంది. ఆనంద్ ఉన్నచోట ఉండలేడు. ఎంత ఆలోచించినా అర్థం కాదు. "అసలు చిత్ర ఎందుకు తన భర్తని చంపిస్తుంది. అసలు ఏం అయ్యి ఉంటుంది. నన్ను కూడా ఇలానే చంపేస్తుందా" అని భయంతో ఆనంద్.. ఇల్లు వదిలి పారిపోవాలనుకుంటాడు..డోర్ తీయగానే చిత్ర కనిపిస్తుంది. ఆనంద్ బయటకు వెళ్ళకుండా ఒక పనిమనిషిని అపాయింట్ చేస్తుంది చిత్ర. ఆ పనిమనిషికి , ఆనంద్ కి మధ్య జరిగే సీన్స్ నవ్విస్తుంటాయి. ఆనంద్ భయపడుతున్నాడనే విషయం చిత్రకి తెలిసిపోయి, ఏంటి విషయం అని అడిగేసరికి.."నువ్వు మీ భర్తని చంపిన విషయం నాకు తెలుసు" అని ఆనంద్ అంటాడు. దానికి చిత్ర, "నీకు తెలుసని, నాకు తెలుసు" అని అంటుంది. ఆనంద్ షాక్ కి గురవుతాడు. ఏం జరిగిందో చెప్పమని ఆనంద్ అడుగుతాడు. దీంతో తన గతం గురించి చెప్తూ ఉంటుంది. అయితే చివరలో వచ్చే ట్విస్ట్ మాత్రం అసలు ఎవరూ ఊహించరు. డైరెక్టర్ బెస్ట్ స్క్రీన్ ప్లేతో కథని నడిపించిన తీరు బాగుంది. ఎక్కడ కూడా డిస్టబ్ సీన్స్ లేకుండా స్టోరీని సస్పెన్స్ తో పాటు ముందుకు తీసుకెళ్ళాడు డైరెక్టర్. చిత్ర పాత్రలో ధన్య బాలకృష్ణ..ఆ పాత్రకి న్యాయం చేసిందనే చెప్పాలి. ఆనంద్ క్యారెక్టర్ గా బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చాడు తేజ ఐనంపూడి. ఇక చిత్రకి భర్తగా నటించిన చైతన్య రావు తన రోల్ ని బాగా చేసాడు.
సస్పెన్స్, థ్రిల్లర్ జోనర్ లో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యిందనే చెప్పాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



