జబర్దస్త్ షో మరో కాంట్రవర్సీ, కోర్టు నోటీసులు..!
on Apr 1, 2016

కామెడీ అనేది చాలా కష్టమైన పని. మనిషికి కోపం తెప్పించినంత సులువుగా నవ్వించలేము. అందుకే కామెడీ బేస్ గా వచ్చిన ఏ ప్రోగ్రామ్ అయినా సూపర్ డూపర్ హిట్టవుతుంటుంది. ఈ కోవలోకే వస్తుంది జబర్దస్త్. స్టార్ట్ అయిన కొన్ని వారాల్లోనే, అద్భుతమైన రేటింగ్స్, మౌత్ టాక్ తో బెస్ట్ టీవీ షో గా మారిపోయింది. కానీ ఉండేకొద్దీ ద్వంద్వార్ధాల స్కిట్స్ వచ్చి చేరడంతో ఈ ప్రోగ్రాంకు విమర్శలు మొదలయ్యాయి. విమర్శలకు తోడు వివాదాలు కూడా అప్పుడప్పుడూ పలకరిస్తుండటంతో, నవ్విస్తున్న షో నవ్వుల పాలవుతోంది.
రీసెంట్ గా టెలికాస్ట్ అయిన ఒక స్కిట్ పై కోర్టు నోటీసులు జారీ చేసింది. ఇండియన్ జ్యుడిషియరీని అపహాస్యం చేసే విధంగా స్కిట్ ను ప్రదర్శించారంటూ ఒక న్యాయవాది జబర్దస్త్ పై పిటిషన్ వేశాడు. పిటిషన్ ను పరిశీలించిన కోర్టు, జబర్దస్ట్ టీం కు నోటీసులు జారీ చేసింది. వివాదాలు జబర్దస్త్ కు కొత్త కాదు. గతంలో ఒక స్టూడెంట్ లీడర్ ఈ ఖతర్నాక్ షో పై కేసు పెట్టాడు. గౌడ కులస్థులు, తమను అవమానించాడంటూ కమెడియన్ వేణుపై చేయి కూడా చేసుకున్నారు. మరో పక్క బూతు స్కిట్స్ పై రోజు రోజుకూ విమర్శలు పెరుగుతున్నాయి. మరి వీటన్నింటినీ ఈ ఖతర్నాక్ కామెడీ షో ఎలా అధిగమిస్తుందో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



