ధనుష్, ఐశ్వర్య మధ్య లవ్ స్టోరీ ఎలా మొదలైందో తెలుసా?
on Jan 18, 2022

కోలీవుడ్ స్టార్ ధనుష్, ఆయన భార్య ఐశ్వర్య రజనీకాంత్ తమ 18 సంవత్సరాల వైవాహిక బంధానికి స్వస్తిచెప్పి ఫిల్మ్ ఇండస్ట్రీతో పాటు వారి అభిమానులనందర్నీ షాక్‌కు గురిచేశారు. ఐశ్వర్యతో విడిపోతున్నట్లు తన సోషల్‌మీడియా హ్యాండిల్స్ ద్వారా షేర్ చేసిన ఓ నోట్‌తో ధనుష్ వెల్లడించాడు. వారిది ప్రేమ వివాహం. 2004లో ఏడడుగులు నడిచిన ఆ ఇద్దరూ ఇప్పటివరకూ ఎంతో అన్యోన్యంగా కాపురం చేస్తున్నట్లు కనిపించారు. వారి కాపురంలో కలహాలు రేగినట్లు ఇటీవల ఎలాంటి సూచనలూ బయటకు రాలేదు.
అసలు ధనుష్, ఐశ్వర్య మధ్య లవ్ స్టోరీ ఎలా మొదలైంది? ఆ ఇద్దరూ తొలిసారి కలుసుకున్నది ఒక సినిమా హాలులో. అదీ.. ధనుష్ నటించిన సూపర్ హిట్ ఫిల్మ్ 'కాదల్ కొండేన్' (2003) ఆడుతున్న థియేటర్‌లో! అక్కడ ఆ సినిమా చూడ్డానికి తన ఫ్యామిలీతో వెళ్లాడు ధనుష్. అదే థియేటర్‌కు రజనీకాంత్ కుమార్తెలు ఐశ్వర్య, సౌందర్య కూడా వచ్చారు. షో అయ్యాక ఐశ్వర్య, సౌందర్యలకు ధనుష్‌ను పరిచయం చేశారు ఆ థియేటర్ యజమాని. అప్పుడు వారిని హలో అని మాత్రమే పలకరించాడు ధనుష్. పెద్దగా వారి మధ్య మాటలేమీ జరగలేదు. అయితే అప్పుడే ధనుష్ అంటే ఐశ్వర్యకు ఇష్టం ఏర్పడింది.
Also read: షాకింగ్.. హీరో ధనుష్, ఐశ్వర్య విడాకులు
ఆ తర్వాత ధనుష్‌ను ఫోన్‌లో పలకరిస్తూ వచ్చింది ఐశ్వర్య. అతడితో ఒకసారి కలుసుకొని మాట్లాడాలని ఉన్నట్లు చెప్పింది. అలా కలుసుకుని మాట్లాడుకున్న తర్వాత స్నేహం కుదిరి, చాలా త్వరగానే అది ప్రణయంగా మారింది. వారి మధ్య అనుబంధం పెనవేసుకుంటున్న విషయం మీడియా దృష్టికి వెళ్లింది. అప్పట్నుంచీ వారిపై డేటింగ్ రూమర్లు మొదలయ్యాయి. సూపర్‌స్టార్ రజనీకాంత్ కుమార్తె ఒక అప్‌కమింగ్ యంగ్ హీరోతో లవ్‌లో పడిందంటూ జరిగిన ప్రచారం రజనీ కుటుంబాన్ని బాగా ప్రభావితం చేసింది. రజనీ, లత దంపతులు కుమార్తెను ఈ విషయమై అడిగనప్పుడు తాను ధనుష్‌ను ప్రేమిస్తున్నానని చెప్పేసింది. దాంతో ధనుష్ ఫ్యామిలీతో మాట్లాడి పెళ్లి ఖాయం చేశారు రజనీ.
Also read: జగపతిబాబుని తిట్టిన స్టార్ హీరో
అలా ఒకటిన్నర సంవత్సరం ప్రేమలో మునిగితేలాక, 2004 నవంబర్ 18న అంగరంగ వైభవంగా జరిగిన వేడుకలో ఐశ్వర్య మెడలో మూడుముళ్లు వేశాడు ధనుష్. ఆ ఇద్దరికీ ఇద్దరు పిల్లలు కలిగారు. 2006లో మొదటి కుమారుడు యాత్ర పుట్టగా, 2010లో రెండో కుమారుడు లింగ జన్మించాడు. ఇన్నాళ్ల తర్వాత ఆ ఇద్దరూ విడిపోయారు. దీని వెనుక అసలు కారణం ఏమిటనేది త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



