Home

»

Latest News

మెగాస్టార్ ఏప్రిల్ హిట్స్ లో `ఆచార్య‌` చేరుతుందా!?

Jan 18, 2022

మెగాస్టార్ చిరంజీవి అభిమానులంతా ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న సినిమా `ఆచార్య‌`. విజ‌నరీ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ రూపొందించిన ఈ సోష‌ల్ డ్రామాలో త‌న త‌న‌యుడు మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తో క‌లిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు చిరు. కాగా, ఈ క్రేజీ ప్రాజెక్ట్ వేస‌వి కానుక‌గా ఏప్రిల్ 1న థియేట‌ర్స్ లోకి రాబోతోంది.

Also Read: జ‌గ‌ప‌తిబాబుని తిట్టిన స్టార్ హీరో

ఇదిలా ఉంటే.. ఏప్రిల్ నెల వేదిక‌గా మెగాస్టార్ చిరంజీవి నుంచి సంద‌డి చేసిన ప‌లు చిత్రాలు విజ‌య‌ప‌థంలో ప‌య‌నించాయి.   ఆ సినిమాలే.. `ఇంట్లో రామ‌య్య వీధిలో కృష్ణ‌య్య‌` (1982), `దేవాంత‌కుడు` (1984), `య‌ముడికి మొగుడు` (1988), `ఘ‌రానా మొగుడు` (1992), `బావ‌గారూ బాగున్నారా?` (1998). వీటిలో `య‌ముడికి మొగుడు`, `ఘ‌రానా మొగుడు` ఇండ‌స్ట్రీ హిట్స్ కాగా.. `బావ‌గారూ బాగున్నారా?`, `ఇంట్లో రామ‌య్య వీధిలో కృష్ణ‌య్య‌` ఘ‌న‌విజ‌యం సాధించాయి. `దేవాంత‌కుడు` కూడా క‌మ‌ర్షియ‌ల్ గా మెప్పించింది. మ‌రి.. మెగాస్టార్ ఏప్రిల్ హిట్స్ జాబితాలో `ఆచార్య‌` కూడా చేరుతుందేమో చూడాలి.

Also Read: ఈ స‌మాజం రేపిస్టుల‌ని ప్రేమిస్తోంది

కాగా, `ఆచార్య‌`లో చిరుకి జంట‌గా టాలీవుడ్ చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ క‌నువిందు చేయ‌నుంది. `ఖైదీ నంబ‌ర్ 150` వంటి సెన్సేష‌న‌ల్ హిట్ త‌రువాత చిరంజీవి, కాజ‌ల్ కాంబినేష‌న్ లో వ‌స్తున్న సినిమా ఇదే కావ‌డం గ‌మ‌నార్హం. 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com