ఆ హీరోయిన్ ఇష్టం లేకుండానే సినిమాలు చేస్తుందట..!
on Jun 7, 2016

నటనకు అవకాశమున్న పాత్ర చేయాలనుకుంటున్నా. అలాంటి ఆఫర్లే ఒప్పుకుంటున్నా. కెరీర్ మిణుకుమిణుకు అంటున్నప్పుడు ప్రతీ హీరోయినూ చెప్పే కబుర్లే ఇవి. ప్రస్తుతం గోవా బేబీ ఇలియానా కూడా ఇవే మాటలు పట్టుకుంది. తనకు అవకాశాలు లేకపోవడం కాదని, తనే ఏదిపడితే అది ఒప్పుకోకుండా సెలక్టివ్ గా సినిమాలు చేస్తున్నానని చెబుతోంది. తనకోసం డైరెక్టర్లు, నిర్మాతలు తీసుకొచ్చే పాత్రలు అసలు నచ్చట్లేదని అంటోంది. " కమర్షియల్ సినిమాల్లో చేయడం, గ్లామర్ రోల్స్ చేయడం నాక్కూడా సరదానే. కానీ కెరీర్ ముగిసిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే, మనకు గుర్తొచ్చే పాత్ర ఒక్కటైనా ఉండాలి కదా. ఇన్నాళ్లూ ఇష్టం లేకుండానే ఆ తరహా పాత్రలు చేశాను. ఇప్పుడు మాత్రం ఏది పడితే అది ఒప్పుకోవడం లేదు. రుస్తుంలో నాకు నటనకు స్కోప్ ఉన్న పాత్ర వచ్చింది. ఇలాంటి సినిమాల కోసమే నేను చూస్తున్నాను " అని సెలవిస్తున్నారు ఇల్లీ బేబీ వారు. అయితే ఈ మాటలు విన్నవాళ్లు మాత్రం, ఛాన్స్ లు రాని ప్రతీ భామ చెప్పే మాటలే ఇవి అంటూ సెటైర్లు వేస్తున్నారు. రుస్తుం తర్వాత అవకాశాలు లేకపోతే, ఇలియానా పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయే ఆలోచనలో ఉందట.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



