ఇలియానాకు తన ఫిగర్ నచ్చలేదట..!
on Jun 3, 2016

ఇలియానా అనగానే ఎవరికైనా గుర్తొచ్చేది ఆమె నడుము. నడుము సుందరిగా పేరు తెచ్చుకున్న ఈ భామంటే కుర్రాళ్లు పడిచచ్చిపోయేవారు. దానికి కారణం కూడా ఆమె ఫిజిక్ అండ్ ఫిగర్. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో, ఫ్యాన్స్ అందరూ షాక్ అయ్యే మాట అనేసింది ఈ అమ్మడు. తనకు తన బాడీ అంటే అసలు నచ్చదట. మరీ లావుగా ఉన్నాను అని నేను ఫీలౌతుంటాను. ఒకానొక టైంలో నేను ఎంత తేలిగ్గా ఉన్నానో నాకు తెలిసిపోయేది. అంత సన్నంగా ఉన్నా, లావుగా ఉన్నట్టే ఫీలయ్యేదాన్ని. చాలా మంది నా ఫిజిక్ అంటే తమకు ఇష్టమని చెబుతుంటారు. కానీ నా వరకూ మాత్రం నా బాడీ నాకు నచ్చదు. చాలా విచిత్రమైన శరీరంగా నన్ను నేను అనుకుంటుంటాను అని చెబుతోందీ గోవా భామ. ప్రస్తుతం అక్షయ్ సరసన నటించిన రుస్తుం పైనే ఆమె ఆశలన్నీ ఉన్నాయి. ఇది తప్ప ఈ భామ ఎకౌంట్ లో సినిమాలేవీ లేవు. ఒక వేళ మూవీ రిలీజ్ తర్వాత కూడా అవకాశాలు రాని పరిస్థితి ఉంటే, తన ఆస్ట్రేలియన్ బాయ్ ఫ్రెండ్ నీబోన్ ను పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోవాలని డిసైడ్ అయిందట ఈ నడుము సుందరి. పాపం ఇల్లీ బేబీ ఫ్యాన్స్ ఏమయిపోతారో..!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



