కన్ను మూసిన ప్రియాంక చోప్రా అమ్మమ్మ..!
on Jun 3, 2016
బాలీవుడ్ యాక్ట్రెస్ ప్రియాంక చోప్రా ఫ్యామిలీలో విషాదం చోటు చేసుకుంది. ప్రియాంక చోప్రా అమ్మమ్మ శుక్రవారం ఉదయం కన్నుమూశారు. కొన్ని రోజుల క్రితమే ఆవిడ 94 వ పుట్టిన రోజు సందర్భంగా ఆమెతో తను దిగిన ఫోటోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అమ్మమ్మ అంటే తనకు చాలా ఇష్టమని, తాను ఎక్కడున్నా, ఎంత బిజీగా ఉన్నా, అమ్మమ్మను చూడటం కోసం గ్యాప్ దొరికినప్పుడల్లా ఆవిడ వద్ద వాలిపోతుంటానని ప్రియాంక చాలా సమయాల్లో చెప్పుకొచ్చారు. ప్రియాంక పద్మశ్రీ అందుకునే సమయంలో కూడా ఆమె అమ్మమ్మ అక్కడే ఉన్నారు. అంతటి ఇష్టమైన అమ్మమ్మను కోల్పోవడంతో ప్రియాంక దు:ఖంలో మునిగిపోయారు. యాడ్ షూటింగ్ లో బిజీగా ఉన్న సమయంలో వార్త విన్న ప్రియాంక వెంటనే ఇంటికి చేరుకున్నారు. సన్నిహితులు, స్నేహితుల నుంచి ఆమెను పరామర్శిస్తుండగా, సోషల్ మీడియాలో అభిమానుల నుంచి సందేశాల వెల్లువెత్తుతోంది.