ప్రభాస్ ‘కల్కి’ విషయంలో అలా చేస్తే జైలు శిక్ష తప్పదు
on Sep 22, 2023
q
‘ఆదిపురుష్’ వంటి భారీ పరాజయం తర్వాత ప్రభాస్ చేస్తున్న సినిమా ‘కల్కి 2898 ఎడి’. వైజయంతి మూవీస్ పతాకంపై సి.అశ్వనీదత్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రభాస్ సరసన దీపికా పదుకొనే హీరోయిన్‌గా నటిస్తోంది. అంతేకాదు, ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్ సీనియర్ హీరోలు కూడా నటిస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే నాగ్ అశ్విన్ ఎంతో కేర్ తీసుకొని ప్రభాస్‌కి మరో బ్లాక్‌బస్టర్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడు.
ఇదిలా ఉంటే.. ఈ సినిమాకి లీకుల బెడద ఎక్కువైంది. ఈ సినిమాలోని సెట్స్‌కు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో దర్శనమివ్వడంతో షాక్ అయ్యారు మేకర్స్. ఈ విషయాన్ని ఎంతో సీరియస్‌గా తీసుకున్న వైజయంతీ మూవీస్ సంస్థ లీక్స్ నుంచి తప్పించేందుకు కాపీ రైట్ నోటీసులు జారీ చేసింది. ఈ సినిమాలోని సన్నివేశాలు, మ్యూజిక్, ఫోటోలు తదితర కాపీరైట్స్, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ హక్కులు కేవలం నిర్మాణ సంస్థకు మాత్రమే సొంతమని తెలియజేసింది. ఈ సినిమా సీన్లు, ఫొటోలు, ఫుటేజ్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసినా కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘన కిందకు వస్తుంది అని హెచ్చరించింది. దీన్ని అతిక్రమిస్తే సైబరాబాద్ పోలీసుల సహకారంతో చట్టపరమైన్యలు తీసుకుంటామని ఆ నోటీసులో తెలిపింది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
