సినిమాగా ఐబొమ్మ రవి జీవితం.. ఇక నిర్మాతకు డబ్బులే డబ్బులు!
on Nov 19, 2025
జీవితంలో ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొని ఉన్నత స్థాయికి చేరినవారు, తమ రంగంలో విశిష్ట సేవలు అందించినవారు, మానవాళికి ఉపయోగపడే కొత్త విషయాలను కనిపెట్టినవారు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వారి జీవితాల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలోనూ ఉంటుంది. ఇప్పటికే అలాంటి మహోన్నత వ్యక్తుల జీవితాలు బయోపిక్‌ల రూపంలో వచ్చాయి. ఇదిలా ఉంటే.. ఐబొమ్మ రవి జీవితాన్ని కూడా తెరకెక్కిస్తారని ఎవరైనా ఊహించారా? కానీ, అది జరుగుతోంది.
రిలీజ్ అయిన సరికొత్త సినిమాలను గంటల వ్యవధిలోనే అందరికీ ఉచితంగా పంచిపెట్టిన ఐబొమ్మ రవి జీవితాన్ని తెరకెక్కించే ప్రయత్నం చేస్తోంది తేజ్ క్రియేటివ్ వర్క్స్ అనే నిర్మాణ సంస్థ. ఇటీవలికాలంలో సంచలనం సృష్టించిన ఇమ్మడి రవి అరెస్ట్, వివిధ మీడియా సంస్థలు అతని గురించి చేస్తున్న ప్రచారం వల్ల అతని జీవితం గురించి తెలుసుకోవాలనే ఆసక్తి పెరిగింది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఐ బొమ్మ రవి గురించి విననివారు లేరంటే అతిశయోక్తి కాదు.
రవికి ఉన్న ఫాలోయింగ్‌ని దృష్టిలో పెట్టుకొని అతని జీవితాన్ని సినిమాగా తీసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటివరకు సినిమాలను పైరసీ చేస్తూ పాపులర్ అయిన రవి జీవితమే సినిమాగా వస్తోందంటే తప్పకుండా అందరిలోనూ క్యూరియాసిటీ ఉంటుంది. దాన్ని క్యాష్ చేసుకునే దిశగా ఆ నిర్మాణ సంస్థ అడుగులు వేస్తోంది. అసలు రవి జీవితం ఎలా మొదలైంది, అతని జీవితంలోని చీకటి వెలుగులు ఏమిటి? పైరసీ చెయ్యాలన్న ఆలోచన అతనికి ఎందుకు వచ్చింది? దానికి సహకరించింది ఎవరు? తక్కువ సమయంలో అతనికి అంత పాపులారిటీ ఎలా వచ్చింది? అనే విషయాల గురించి ఈ సినిమాలో చర్చిస్తారని తెలుస్తోంది. సినిమాలను పైరసీ చేసి పాపులర్ అయిన రవి జీవితం సినిమాగా వస్తే దాన్ని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారనేది ప్రశ్న. అయితే ఇప్పుడు రవికి వచ్చిన ప్రచారం వల్ల సినిమాకి హైప్ వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమాలో రవి పాత్ర కోసం ఎవరిని ఎంపిక చేస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



