నా సినిమాకి నెగిటివ్ టాక్ వస్తే అర్ధనగ్నంగా తిరుగుతా.. ఏరియా ఇదే
on Nov 19, 2025

దర్శకుడు సంచలన వ్యాఖ్యలు
సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు
రాజు వెడ్స్ రాంబాయి ఎలా ఉండబోతుంది!
ఖమ్మం, వరంగల్ బోర్డర్ లో జరిగిన కథ
ఒక సినిమా అన్ని హంగుల్ని హద్దుకొని సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెట్టడానికి ప్రధాన మూలస్థంభంగా నిలిచే వ్యక్తి దర్శకుడు. అటువంటి దర్శకులకి తమ సినిమా ప్రేక్షకులకి ఖచ్చితంగా నచ్చుతుందనే నమ్మకం ఉంటుంది. కానీ అంతిమ తీర్పు మాత్రం ప్రేక్షకులదే. కానీ ఈ మధ్య కాలంలో సదరు ప్రేక్షకులకి దర్శకులు సవాలు విసురుతున్నారు.
ఈ నెల 21 న 'రాజు వెడ్స్ రాంబాయి'(Raju weds rambai)అనే మూవీ రిలీజ్ కాబోతుంది. రొమాంటిక్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కగా అఖిల్ రాజ్(AKhil Raj)తేజస్వి రావు(Tejaswi Rao)జంటగా నటించారు. సాయిలు కంపాటి(Saailu Kaampati)రచన దర్శకత్వం వహించాడు. నిన్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సాయిలు మాట్లాడుతు నా సినిమాకి నెగిటివ్ టాక్ వస్తే అమీర్ పేటలో అర్ధనగ్నంగా తిరుగుతాను అనే వైరల్ కామెంట్ చేసాడు. దీంతో సోషల్ మీడియా వేదికగా పలువురు సినీ ప్రియులు స్పందిస్తు సినిమా బాగుంటే ఖచ్చితంగా మంచి టాక్ తో రన్ అవుతుంది. బాగున్నసినిమాని కావాలని ఎవరైనా నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేసినా ఎవరు నమ్మరు. సినిమాకి అంత శక్తీ ఉంది. అలాంటిది ఈ రకంగా బోల్డ్ స్టేట్ మెంట్ ఇవ్వడం ఎందుకనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
also read: ఎవరు ఎటు వైపు.. ఏం జరగబోతుంది!
మరి కొంత మంది స్పందిస్తు ఒక వేళ సినిమా బాగోక నెగిటివ్ టాక్ వస్తే నిజంగానే అమీర్ పేట లో తిరుగుతాడా ఏంటనే కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఏది ఏమైనా దర్శకుడు చేసిన వ్యాఖ్యలు సినీ సర్కిల్స్ లో వైరల్ గా మారాయి. సురేష్ బొబ్బిలి సంగీత సారధ్యంలో రాహుల్ మోపిదేవి నిర్మించగా, ఖమ్మం, వరంగల్ బోర్డర్ కి సంబంధించి ఒక ఏరియాలో జరిగిన నిజజీవిత క్యారెక్టర్స్ ఆధారంగా 'రాజు వెడ్స్ రాంబాయి' తెరకెక్కింది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



