మ్యూజికల్ గా మెప్పించిన `రుద్రనేత్ర`కి 33 ఏళ్ళు!
on Jun 16, 2022

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో పలు మ్యూజికల్ హిట్స్ ఉన్నాయి. వాటిలో `రుద్రనేత్ర` ఒకటి. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు తెరకెక్కించిన ఈ స్పై డ్రామాలో డిటెక్టివ్ ఏజెన్సీకి చెందిన ఏజెంట్ రుద్రనేత్రగా తనదైన అభినయంతో అలరించారు చిరంజీవి. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి, అందాల తార రాధ కథానాయికలుగా ఎంటర్టైన్ చేసిన ఈ సినిమాలో రేఖ, రావుగోపాలరావు, రఘువరన్, రంగనాథ్, నూతన్ ప్రసాద్ ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు. యండమూరి వీరేంద్రనాథ్ రచన చేసిన ఈ చిత్రానికి కె. రాఘవేంద్రరావు స్క్రీన్ ప్లే సమకూర్చారు.
మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా బాణీలతో రూపొందిన `రుద్రనేత్ర`లోని పాటలన్నీ విశేషాదరణ పొందాయి. ``ఏక్ దో తీన్``, ``అందమివ్వు ఆదివారము``, ``ఎల్ అంటే ఓ అంటే``, ``ఖజురహోలో``, ``జెట్ స్పీడ్``, ``అబ్బబ్బబ్బ`` అంటూ మొదలయ్యే గీతాలన్నీ అప్పటి ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర ఫిలింస్ పతాకంపై బి.హెచ్. వరహనరసింహరాజు నిర్మించిన `రుద్రనేత్ర`.. 1989 జూన్ 16న విడుదలై మ్యూజికల్ హిట్ గా మెప్పించింది. కాగా, నేటితో ఈ చిత్రం 33 వసంతాలను పూర్తిచేసుకుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



