'ఖైదీ' హిందీ రీమేక్‌లో హృతిక్!
on Feb 12, 2020

కార్తీ టైటిల్ రోల్ పోషించగా తెలుగు, తమిళ భాషల్లో సూపర్ హిట్టయిన 'ఖైదీ' సినిమాని హిందీలో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఒరిజినల్‌ను నిర్మించిన డ్రీమ్ వారియర్ పిక్చర్స్‌తో కలిసి ఈ రీమేక్‌ను నిర్మిస్తున్నట్లు రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ఈ నెల మొదట్లో ప్రకటించింది. కాగా ఈ మూవీలో మెయిన్ రోల్‌ను హృతిక్ రోషన్ చేయనున్నాడంటూ బాలీవుడ్‌లో న్యూస్ చక్కర్లు కొడుతోంది. తన కూతుర్ని చూసేందుకు పదేళ్ల తర్వాత జైలు నుంచి విడుదలైన ఒక ఖైదీ చేసిన ప్రయాణం, ఆ ప్రయాణంలో అనుకోకుండా ఎదురైన ఆపదలను అతను ఎదుర్కొన్న వైనం తెలుగు, తమిళ ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకుంది. హీరోయిన్ లేకుండా, పాటలు లేకుండా, ఎమోషన్స్‌ను మిక్స్ చేసి పూర్తి స్థాయి యాక్షన్ మూవీగా తయారైన ఆ సినిమా సాధించిన విజయం అందర్నీ ఆశ్చర్యపరచింది.
ఇప్పుడు అదే మ్యాజిక్ హిందీలోనూ జరుగుతుందని నిర్మాతలు భావిస్తున్నారు. తారాగణం ఎంపిక పూర్తవగానే షూటింగ్ ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారు. అన్నీ అనుకూలిస్తే 2020 చివరలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలున్నాయి. ఒరిజినల్‌ను డైరెక్ట్ చేసిన లోకేశ్ కనకరాజ్‌ను ఈ సినిమానీ డైరెక్ట్ చెయ్యమని అడుగుతున్నట్లు డ్రీమ్ వారియర్ పిక్చర్స్ అధినేతల్లో ఒకరైన ఎస్.ఆర్. ప్రభు తెలిపారు. లోకేశ్ ప్రస్తుతం విజయ్‌తో తమిళంలో 'మాస్టర్' మూవీని రూపొందిస్తున్నాడు. 'ఖైదీ' హిందీ రీమేక్‌లో హృతిక్ నటించడం ఖాయమైతే, అది హృతిక్‌కు ఒక భిన్నమైన సినిమా అవడమే కాకుండా దేశవ్యాప్త సినీ ప్రియులకు ఒక కొత్త అనుభవన్ని ఇచ్చినవాడవుతాడని చెప్పడానికి సందేహించాల్సింది లేదు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



