కరోనా ఎఫెక్ట్: ఒకే ఇంట్లో హృతిక్ & ఎక్స్ వైఫ్!
on Mar 26, 2020

ఆరేళ్ల క్రితం (నవంబర్ 2014లో) విడాకులు తీసుకుని వేరుపడిన బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, అతడి మాజీ భార్య సుసానే ఖాన్‌ను కరోనా మళ్లీ కలిపింది. ప్రస్తుతం వీరిద్దరూ ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే... హృతిక్ ఇంటికి సుసానే వచ్చారు. పిల్లల కోసం వీరిద్దరూ ఒకే ఇంటిలో ఉంటున్నారు.
ప్రస్తుతం కరోనా వ్యాప్తిని అరికట్టడం కోసం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. సామాజిక దూరం పాటించాలని, అత్యవసర అవసరాల కోసం సాధారణంగా బయటకు రావొద్దని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విజ్ఞప్తి చేస్తున్న నేపథ్యంలో హృతిక్ అండ్ ఫ్యామిలీ బయటకు రాకూడదని నిర్ణయించుకున్నారు. పిల్లలు తల్లితండ్రులకు దూరంగా కొన్ని వారాల పాటు ఉండటం మంచిది కాదని హృతిక్, సుసానే భావించారు. స్వచ్ఛందంగా హృతిక్ ఇంటికి సుసానే వచ్చారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ విషయాన్ని చెప్పిన హృతిక్, తన మాజీ భార్యను ప్రశంసించారు. వీళ్ల నిర్ణయం మరింతమందికి ఆదర్శం కావాలని ఆశిద్దాం. విడాకులు తీసుకున్న తర్వాత కూడా పిల్లల కోసం వీరిద్దరూ చాలాసార్లు హాలిడే ట్రిప్స్ వేశారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



