కరోనాపై పోరాటం: అనిల్ రావిపూడి రూ. 10 లక్షల విరాళం
on Mar 26, 2020

కరోనా మహమ్మారిపై పోరాటానికి తెలుగు చిత్రసీమ నుంచి మద్దతు పెరుగుతోంది. తాజాగా 'సరిలేరు నీకెవ్వరు' డైరెక్టర్ అనిల్ రావిపూడి కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి రెండు తెలుగు రాష్ట్రాలకు తన వంతుగా మొత్తం రూ. 10 లక్షలు విరాళం ప్రకటించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధులకు చెరో రూ. 5 లక్షలు అందజేస్తున్నట్లు గురువారం ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలందరూ సామాజిక దూరం పాటిస్తూ, ఇళ్లల్లో ఉండి లాక్‌డౌన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఒకరికొకరు దూరంగా ఉంటూ కరోనా వ్యాప్తి గొలుసును పగలకొట్టాలని ఆయన పిలుపునిచ్చారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



