రెండోసారి రామ్‌చరణ్‌తో సై సై అని కియారా ఎందుకందంటే...
on Jun 13, 2022

'అర్జున్‌రెడ్డి' హిందీ రీమేక్ 'కబీర్‌సింగ్'తో ఉత్తరాదిన, మహేశ్‌బాబు మూవీ 'భరత్ అనే నేను'తో తెలుగునాట ఇంటింటికీ తెలిసింది బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ. రామ్‌చరణ్ జోడీగా నటించిన 'వినయ విధేయ రామ' ఫ్లాపైనప్పటికీ, టాలీవుడ్‌లో ఆమె డిమాండ్ ఏమాత్రం తగ్గలేదు. మెస్మరైజింగ్ బ్యూటీగా ఆమెకున్న పేరుకు తగ్గట్లు, చక్కని పర్ఫార్మర్‌గా కూడా గుర్తింపు లభించడంతో బాలీవుడ్‌లోనే ఆమెకు చేతినిండా సినిమాలున్నాయి. దాంతో ఇతర భాషల చిత్రాల్లో నటించడానికి ఆమెకు తీరిక లభించడం లేదు.
ఈ నేపథ్యంలో రెండు తెలుగు సినిమాల్లో నటించడానికి వచ్చిన అవకాశాల్ని ఆమె వదులుకుంది. వాటిలో ఒకటి వరుణ్‌తేజ్ 'గని' కాగా, మరొకటి విజయ్ దేవరకొండ 'లైగర్' ప్రాజెక్ట్. 'గని' మూవీని సున్నితంగా తిరస్కరించిన ఆమె, 'లైగర్'లో నటించడానికి ఆసక్తి ప్రదర్శించింది కానీ, డేట్స్ అడ్జస్ట్ చేయడం ఆమె తలకు మించిన పనయింది. అది కరణ్ జోహార్ ప్రాజెక్ట్ కావడంతో, అప్పటికే విజయ్‌తో ఓ కమర్షియల్ యాడ్‌లో నటించేప్పుడు ఏర్పడిన స్నేహం వల్ల కూడా 'లైగర్' చేయాలనుకుంది. కానీ కేవలం డేట్స్ ప్రాబ్లెమ్ వల్ల దాన్ని వదులుకుంది.
అయితే రామ్‌చరణ్‌తో రెండోసారి కలిసి నటించడానికి వచ్చిన ఆఫర్‌ను మాత్రం రెండు చేతులా ఆమె ఆహ్వానించింది. ఆ మూవీకి డైరెక్టర్ శంకర్ కావడం, చరణ్‌తో అప్పటికే మంచి స్నేహం ఉండటంతో బాలీవుడ్‌లో బిజీగా ఉన్నప్పటికీ ఆ మూవీకి డేట్స్ అడ్జస్ట్ చేసింది కియారా. పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా తయారవుతున్న 'ఆర్‌సీ 15' మూవీలో ఆమెది.. ఇటు గ్లామర్ కురిపించే పాత్ర మాత్రమే కాకుండా, పర్ఫార్మెన్స్‌కు మంచి అవకాశం ఉన్న పాత్ర అని తెలుస్తోంది. అందుకే చరణ్ జోడీగా రెండోసారి నటించడానికి సై అంది ఈ బ్యూటీ.
ఇటీవల ఆమె నటించిన హిందీ చిత్రం 'భూల్ భులయ్యా '2 బ్లాక్‌బస్టర్ హిట్ అవడంతో కియారా డిమాండ్, తదనుగుణంగా ఆమె రెమ్యూనరేషన్ బాగా పెరిగాయి. వరుణ్ ధావన్ జోడీగా ఆమె నటించిన 'జుగ్‌జుగ్ జీయో' మూవీ త్వరలో రిలీజ్ కానుండగా, విక్కీ కౌశల్ జోడీగా నటించిన 'గోవిందా నామ్ మేరా' షూటింగ్ పూర్తయింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



