పూరి-దేవరకొండ 'ఫైటర్'లో హాలీవుడ్ యాక్టర్స్?
on Jan 18, 2020

'ఇస్మార్ట్ శంకర్' హిట్ దర్శకుడు పూరి జగన్నాథ్ లో కొత్త జోష్ తీసుకొచ్చింది. సూపర్ డూపర్ సక్సెస్, ఇండస్ట్రీ హిట్స్ పూరికి కొత్త కాదు. కానీ, కొన్ని ప్లాప్స్ తర్వాత 'ఇస్మార్ట్ శంకర్' రావడంతో అతడు మళ్లీ ఫుల్ రీఛార్జ్ అయ్యాడు. ఈ హుషారులో విజయ్ దేవరకొండ హీరోగా 'ఫైటర్' తీయడానికి రెడీ అవుతున్నాడు. 'వరల్డ్ ఫేమస్ లవర్' తర్వాత 'అర్జున్ రెడ్డి' హీరో నటించనున్న సినిమా ఇదే.
పాన్ ఇండియన్ ఫిలింగా 'ఫైటర్'ను తెరకెక్కించనున్నట్టు పూరి జగన్నాథ్ ఆల్రెడీ అనౌన్స్ చేశాడు. ఫేమస్ హిందీ డైరెక్టర్, ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ ఈ సినిమాలో ప్రొడక్షన్ పార్టనర్ గా జాయిన్ అయ్యాడు. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే... ఈ సినిమాకు ఇంటర్నేషనల్ అప్పీల్ తీసుకురావడానికి పూరి ట్రై చేస్తున్నాడట. 'ఫైటర్'లో కొన్ని క్యారెక్టర్స్ కు బాలీవుడ్, హాలీవుడ్ యాక్టర్స్ ను తీసుకోవాలని ఆలోచిస్తున్నాడట. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ థాయ్ ల్యాండ్ వెళ్ళాడు. అక్కడ మార్షల్ ఆర్ట్స్ లో స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. త్వరలో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు. అయితే, ఇంకా హీరోయిన్ ఎవరనేది ఫిక్స్ కాలేదు. శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ పేరు వినబడుతోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



