'హిట్-2' కలెక్షన్ల వర్షం.. అప్పుడే బ్రేక్ ఈవెన్ దిశగా పరుగులు
on Dec 4, 2022
అడివి శేష్ ప్రధాన పాత్రధారిగా శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందిన 'హిట్-2' కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. డిసెంబర్ 2న విడుదలైన ఈ చిత్రం రెండు రోజుల్లో వరల్డ్ వైడ్ గా దాదాపు రూ.11 కోట్ల షేర్ రాబట్టింది. మూడు రోజుల్లోనే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించేలా ఉంది.
ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు రూ.4.03 కోట్ల షేర్, రెండో రోజు రూ.3.28 కోట్ల షేర్ వసూలు చేసిన 'హిట్-2'.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి రెండు రోజుల్లో రూ.7.31 కోట్ల షేర్(రూ.11.90 కోట్ల గ్రాస్)తో సత్తా చాటింది. రెస్టాఫ్ ఇండియా రూ.0.85 కోట్ల షేర్, ఓవర్సీస్ లో రూ.2.80 కోట్ల షేర్ సాధించింది. వరల్డ్ వైడ్ గా మొదటి రోజు రూ.6.43 కోట్ల షేర్, రెండో రోజు రూ.4.53 కోట్ల షేర్ రాబట్టిన హిట్-2.. రెండు రోజులకు గాను రూ.10.96 కోట్ల షేర్(రూ.19.15 కోట్ల గ్రాస్) కలెక్ట్ చేసిందని సమాచారం. ఈ మూవీ థియేట్రికల్ బిజినెస్ రూ.14.25 కోట్లని అంచనా. ఈరోజు మరో రూ.4 కోట్లకు పైగా షేర్ రాబట్టే అవకాశమున్న ఈ చిత్రం మూడో రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశముంది.
Also Read