అడివి శేష్ ఖాతాలో మరో 'హిట్' లోడింగ్!
on Sep 15, 2022

ఈ ఏడాది జూన్ లో విడుదలైన 'మేజర్'తో బ్లాక్ బస్టర్ అందుకున్న యంగ్ హీరో అడివి శేష్ మరో చిత్రంతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. శేష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'హిట్-2' విడుదల తేదీని తాజాగా ప్రకటించింది మూవీ టీమ్.
నేచురల్ స్టార్ నాని నిర్మాతగా మారి యువ ప్రతిభను ప్రోత్సహిస్తూ వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై సినిమాలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో శైలేశ్ కొలను దర్శకత్వంలో ఆయన నిర్మించిన చిత్రం 'హిట్: ది ఫస్ట్ కేస్'(2020). దీనికి సీక్వెల్ గా 'హిట్: ది సెకండ్ కేస్' వస్తోంది. ఇందులో విశ్వక్ సేన్ కి బదులుగా శేష్ నటిస్తుండటం అందరి దృష్టిని ఆకర్షించింది. 'క్షణం', 'గూఢచారి', 'ఎవరు' వంటి విభిన్న చిత్రాలతో మినిమమ్ గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్నాడు శేష్. ఇక ఇటీవల 'మేజర్'తో ఘన విజయాన్ని అందుకొని ఆ పేరుని మరింత బలపరుచుకున్నాడు. ఈ క్రమంలో శేష్ తాజా చిత్రం 'హిట్-2'పై ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ ని ప్రకటించారు. ఈ మూవీ డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.

రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తూ పోస్టర్ ని వదిలారు. పోస్టర్ లో సిగరెట్, నల్ల కళ్ళద్దాలతో ఉన్న శేష్ ఇంటెన్స్ లుక్ ఆకట్టుకుంటోంది. ఈ ఫిల్మ్ లో కృష్ణ దేవ్ అనే పాత్రలో శేష్ అలరించనున్నాడు. శైలేశ్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ గా జాన్ స్టీవర్ట్, సినిమాటోగ్రాఫర్ గా మణికందన్, ఎడిటర్ గా గ్యారీ బీహెచ్ వ్యవహరిస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



