'గ్యాంగ్ లీడర్'లో నటించానని గుర్తుచేసేసరికి చిరంజీవి ఆశ్చర్యపోయారు!
on Sep 15, 2022

తెలుగు మూవీ ఇండస్ట్రీలో సమ్మెట గాంధీ విలక్షణమైన క్యారెక్టర్ ఆర్టిస్ట్. తెల్ల గడ్డంతో బోల్డ్ క్యారెక్టర్స్ లో కనిపిస్తూ అలరిస్తూ ఉంటారు. ఐతే ఇటీవల ఆయన తన నట ప్రస్థానంలో కొన్ని విషయాలను తెలుగువన్ చానల్‌కు ఇచ్చిన లేటెస్ట్ ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నారు. "సురేందర్ రెడ్డి 'సైరా నరసింహారెడ్డి' సినిమాలో బోయవాడిగా నాకు చాలా మంచి వేషం ఇచ్చారు. ఐతే అక్కడ నేను ఒక డైలాగ్ చెప్పాలి. అంతా చదివేసి ఓకే అని సురేందర్ రెడ్డికి చెప్పాను. తర్వాత చిరంజీవి గారు వచ్చి 'ఒక సారి చూద్దామా' అని అడిగారు. సరే అని డైలాగ్ చెప్పేసరికి 'బాగుంది' అని చిరు గారు అన్నారు. సురేందర్ రెడ్డి 'టేక్ కి వెళ్ళిపోదాం' అనేసరికి అలా ఆ డైలాగ్ నేను చెప్పడం, ఆయన మైక్ లో బ్రహ్మాండంగా చెప్పారని మెచ్చుకోవడం నిజంగా మర్చిపోలేని విషయం." అని ఆయన చెప్పారు.
అప్పుడే చిరంజీవి కూడా గాంధీని ప్రశంసించారు. దాంతో "మీతో కలిసి ఖైదీ 150లో చేసాను, 1991లో వచ్చిన 'గ్యాంగ్ లీడర్'లో చేశా సర్ష అని చెప్పారు గాంధీ. "ఆయన ఆశ్చర్యపోతూ, ఏ క్యారెక్టర్ చేశారు? అని అడిగారు. జీపు డ్రైవర్‌గా నేను చేసిన క్యారెక్టర్ ని చెప్పేసరికి ఆయన 'అది చేసింది నువ్వా.. ఆ సీన్ నేనెప్పుడూ మర్చిపోలేను' అన్నారు." అని గుర్తు చేసుకున్నారు.
"ఇప్పుడు 'గాడ్‌ఫాదర్' మూవీలో మళ్ళీ ఆయనతో కలిసి ఆయన అనుచరుల్లో ఒకరిగా చేస్తున్నాను. చిరంజీవిగారి విషయానికి వస్తే ఆయన టైం అంటే టైం. ఒకప్పుడు ఎన్టీఆర్ అలా టైం మైంటైన్ చేసేవారు. ఇప్పుడు చిరంజీవి గారు. ఆయన వచ్చి చిన్నపిల్లల్లా సీన్ పేపర్లు తీసుకుని చదువుకుంటారు. ఎదుటివాళ్లను చిన్నా పెద్దా అని చూడరు. బాగా గౌరవిస్తారు." అంటూ చిరంజీవి గురించి ఎన్నో విషయాలు చెప్పుకొచ్చారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



