కళ్ళు చెదిరేలా హిట్-3 బిజినెస్.. టార్గెట్ ఎంతో తెలుసా..?
on Apr 23, 2025
న్యాచురల్ స్టార్ నాని హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'హిట్-3'. వాల్ పోస్టర్ సినిమా, యునానిమస్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. హిట్ ఫ్రాంచైజ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో పాటు, ప్రచార చిత్రాలు ఆకట్టుకోవడంతో 'హిట్-3'పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే భారీస్థాయిలో థియేట్రికల్ బిజినెస్ చేసింది. (Hit 3)
'హిట్-3' మూవీ వరల్డ్ వైడ్ గా దాదాపు రూ.50 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. నైజాంలో రూ.13 కోట్లు, ఆంధ్రాలో రూ.15 కోట్లు, సీడెడ్ లో రూ.5.40 కోట్లతో.. తెలుగు రాష్ట్రాల్లో రూ.33.40 కోట్ల బిజినెస్ చేసింది. ఇక ఓవర్సీస్ లో రూ.10 కోట్ల బిజినెస్ జరగగా, కర్ణాటక(రూ.3 కోట్లు), రెస్టాఫ్ ఇండియా కలిపి దాదాపు రూ.6 కోట్లు జరిగినట్లు సమాచారం. అంటే ప్రపంచవ్యాప్తంగా రూ.49.40 కోట్ల బిజినెస్ చేసిందన్నమాట. ఈ లెక్కన బ్రేక్ ఈవెన్ సాధించాలంటే కనీసం రూ.50 కోట్ల షేర్ రాబట్టాల్సి ఉంది.
దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారం వంటి హ్యాట్రిక్ హిట్స్ తర్వాత నాని నుంచి వస్తున్న చిత్రమిది. ఇందులో మునుపెన్నడూ లేనంత వయలెంట్ గా కనిపిస్తున్నాడు. మరి మొదటిసారి పూర్తి వయలెంట్ గా మారిపోయిన నాని.. హిట్-3 తో మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంటాడేమో చూడాలి.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
