అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టం..తెలుగు నేర్చుకుంటున్నాను
on Apr 23, 2025
సంపూర్ణేష్ బాబు (Sampoornesh Babu), సంజోశ్(Sanjosh) హీరోలుగా మన్ మోహన్ మేనంపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ 'సోదరా'(Sodara). ఈ నెల 25 న విడుదల కాబోతున్న ఈ మూవీని కాన్ ఎంటర్ టైన్ మెంట్స్ పై చంద్ర నిర్మించాడు. ప్రచి బన్సాల్(Prachi Bansal), ఆర్తి గుప్తా(Aarti Gupta) హీరోయిన్స్ గా చేస్తుండగా బాబుమోహన్, గెటప్ శ్రీను, బాబా భాస్కర్ కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు.
రిలీజ్ ని పురస్కరించుకొని మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన్న ఆర్తిగుప్తా.. 'సోదరా'కి సంబంధించిన విషయాలతో పాటు కొన్ని పర్సనల్ విషయాలని కూడా పంచుకుంది. "మూవీలో అమాయకపు పల్లెటూరి అమ్మాయి క్యారక్టర్ లో కనిపించాను. బాగా చదువుకున్నా కూడా చాలా సింపుల్ గా ఉండటంతో పాటు మంచి లవ్ ట్రాక్ కూడా ఉంది. అయితే అన్నదమ్ముళ్లలో ఎవరితో ప్రేమలో పడతానో మూవీ చూసి తెలుసుకోవాల్సిందే. నేను పుట్టి పెరిగిందంతా చండీగఢ్. అయినా సరే ముంబైలో స్థిరపడ్డాను. తెలుగు ఇండస్ట్రీలో స్థిర పడాలనే లక్ష్యంతో తెలుగు నేర్చుకుంటున్నాను. అన్ని తరహా పాత్రలు చేసి ప్రేక్షకుల్లో మంచి నటి అనే పేరు తెచ్చుకోవాలనేదే నా లక్ష్యం. అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టం. అలియా భట్ నటన నాకు స్ఫూర్తి" అని చెప్పుకొచ్చింది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
