నిజం చెప్పిన సమంత
on Sep 17, 2016

గత కొన్ని రోజులుగా హీరోయిన్ సమంతపై రకరకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అందులో ముఖ్యంగా సమంత ఇక సినిమాలకు గుడ్ బై చెబుతుంది అన్న వార్త ఫిలిం నగర్లో హల్ చల్ చేస్తుంది. దీనికి కారణం అక్కినేని నాగార్జున తనయుడు నాగ చైతన్యతో పెళ్లే కారణమని...అందుకే సినిమాలు ఒప్పుకోవడం లేదని టాలీవుడ్ కోడై కూసింది. ఈ వార్తలపై సమంత కూడా ఇప్పటి వరకూ సైలెంట్ గానే ఉంది. అయితే ఇప్పుడు మాత్రం తాను ఎందుకు సినిమాలు చేయడానికి ఒప్పుకోవడం లేదో నిజం చెప్పేసింది. అదేంటంటే.. తనకు మంచి పాత్రలు దొరకడం లేదని అందుకే సినిమాలు ఒప్పుకోవడం లేదని ట్వీట్ చేసింది.
‘దక్షిణాది చిత్ర పరిశ్రమలో కథానాయికకు అర్థవంతమైన పాత్రలు దొరకడం ఎంత కష్టమో అర్థమైంది. నేను ఎక్కువ సినిమాలకు సంతకం చేయకపోవడానికి గల ఒకే ఒక్క కారణం పాత్రలు మంచివి లభించకపోవడమే. ఇది చెప్పడం చాలా బాధాకరంగా ఉంది’ అని సమంత ట్వీట్ చేశారు. మరి సమంత ఈ వార్తలకు బ్రేక్ వేయడానికి చెప్పారా.. నిజంగానే రోల్స్ రాక ఒప్పుకోవడం లేదా.. సమంతకే తెలియాలి..
.jpg)
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



