అనుష్క పెళ్లి నిర్మాతతోనా..?
on Sep 17, 2016

హీరోయిన్ అనుష్క దక్షిణాదిన బిజీ హీరోయిన్. అయితే ఇప్పుడు అనుష్కపై ఓ వార్త చక్కర్లు కొడుతుంది. అందరి హీరోయిన్స్ పెళ్లి వార్తల్లాగే అనుష్క పెళ్లి వార్త కూడా ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఇప్పటికే అనుష్క పెళ్లిపై పలు పుకార్లు వచ్చాయి. ఇప్పుడు అనుష్క టాలీవుడ్‌కు చెందిన టాప్ నిర్మాతను వివాహం చేసుకోనుందని టాలీవుడ్లో వార్తలు గుప్పుమన్నాయి. ఇది పరిశ్రమలో పెద్ద సంచలనంగా మారింది. అంతేకాదు వీరిద్దరూ గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారని, అనుష్కతో నిర్మాత అన్యోన్యంగా ఉంటున్న విషయం నిర్మాత కుటుంబ సభ్యులకు కూడా తెలుసని నిర్మాతకు చెందిన సన్నిహిత వర్గాల సమాచారం. అయితే ఇక్కడ మరో ట్విస్ట కూడా ఉందండోయ్.. అదేంటంటే.. ఈ నిర్మాత ఇప్పటికే అనుష్కతో కొన్ని సినిమాలు కూడా నిర్మించాడట.. ఇంకా షాకయ్యే విషయం ఏంటంటే.. ఆయనకు ఒకసారి పెళ్లి కూడా అయిందట. ఇంతకీ ఎవరై ఉంటారబ్బా.. ఆల్ రెడీ అనుష్కతో సినిమాలు నిర్మించి.. ఒకసారి పెళ్లయిన నిర్మాత ఎవరో ఆలోచించండి.. మీ బుర్రకి పదునుపెట్టండి.. కాగా ప్రస్తుతం అనుష్క బాహుబలి-2 షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



